Tuesday, January 19, 2021

కొర్హలె గ్రామము (కోరాల) లోగల షిర్డీ సాయి సహజ (నిజ) పాదుకా మందిర్ చరిత్ర / స్థలపురాణం
 
సాయి నిజ పాదుకల చరిత్ర:
షిర్డీ సాయిబాబా ప్రతీరోజూ 5 ఇళ్ళలో బిక్ష చేసేవారు. అలా బిక్ష చేసే ఇళ్ళలో శ్రీ వామన్    గొం డ్కర్ ఇల్లు కుడా ఒకటి. అలా బిక్ష రూపంలో తీసుకుని   వచ్చిన పదార్ధాలలో కొంత ద్వారకామా7యి ద గ్గర ఉండే కుక్కలకూ, పక్షులకూ, పిల్లులకూ రోజూ ఒకే ప్రదేశంలో ఒక బండ మీద నిలబడి జల్లేవారు. తదుపరి జంతువులు స్వేచ్చగా వచ్చి 5. అలా అనేక సంవత్సరాలు అదే బండపై నిలబడి ఆహారం వేదజల్లడం వల్ల శ్రీ సాయిబాబా వారి పాద ముద్రలు వాటి మీద శాశ్వతంగా పడ్డాయి. ఇది వింతల్లో కెల్లా 54444వింత. శ్రీ సాయిబాబా నిజ పాద ముద్రలు పడిన ఏకైన బండ అది. అయితే శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ప్రతి రోజూ బిక్షలో ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని,te(పులుసు,పాయసం,చారు లాంటివి) ఇచ్చేవారు. అది గమనించిన సాయి బండ మీద శాశ్వతంగా పడిన పాద ముద్రల  There is no proper  signal in this area meeting continue gaa ravadam leduu తన చూపుడు వ్రేలితో గుండ్రంగా బండ మీద తిప్పి అప్పటికప్పుడు ఒక గుంతను,te (Pit Hole) చేసారు. శ్రీ వామన్ రావ్ గొండ్కర్ భార్య ఇచ్చే ద్రవ పదార్ధాలను ఆ గుంతలో పోసేవారు,te. ఒక్కోసారి పక్షుల దాహం తీర్చడం కోసం ఆ గుంతలో మంచినీళ్ళు కుడా పోసేవారు .

KRL-37E

సాయి నిజ పాదుకలు Korhale గ్రామానికి ఎలా తీసుకుని రాబడ్డాయి?
శ్రీ సాయి బాబా మహా సమాధి అనంతరం నిజ పాదుకా ముద్రలు కలిగిన ఆ బండ శ్రీ వామన్ రావ్ గొండ్కర్ గారు భద్రపరిచారు. తదుపరి శ్రీ వామన్ రావ్ గొండ్కర్ మనవడైన అమృత రావ్ గొండ్కర్ వద్దకు ఆ నిజ పాదముద్రల బండ చేరింది. వారు ఆ నిజ పాదముద్రల బండను కలిగిన భూమిని నిజ పాద ముద్రలు పడిన బండతో సహా గుజరాతీ వారైన “భికాజీ – షకారాంషెల్కే” కుటుంబానికి అమ్మారు. భికాజీ వారు Shirdi లో “Nrusimha Guest House” (Nrusimha Lodge) అనే పేరుతో ఒక Lodge ను కట్టారు. అలా కడుతున్నప్పుడు ఈ నిజ పాదముద్రలు పడిన బండను ఒక గోడలో పెట్టి సిమెంటు చేసి స్థిరంగా ఏర్పాటుచేసారు. తదుపరి 2004 లో Shirdi బాగా ఆధునీకరింపబడినది. ఆధునీకరణలో భాగంగా Nrusimha Guest House ఉన్న రోడ్డును (Pallaki Road) వెడల్పు చేయసంకల్పించారు. అందులో భాగంగా శ్రీ సాయి బాబా నిజ పాదుకా ముద్రలు ఉన్న ఆ బండను స్థాపించిన గోడను (Nrusimha Guest House ముందు భాగాన్ని) 06/May/2004 రోజున పడగొట్టాలని నిర్ణయించారు. అక్కడి స్థానికులు ఎంత చెప్పినా అధికారులు వినలేదు. Bulldozer లతో ఆ గోడను కుల్చేసారు. వందల కొద్దీ పగిలిన ఇటుక రాళ్ళు ఆ నిజ పాద ముద్రలపై పడ్డాయి. జరిగేదంతా అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు). తదుపరి Shakaaram Shelke వంశస్తులైన వారు అక్కడ నిలబడ్డ ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ను చూసి “ఈ బండను మీరు తీసుకెళ్ళండి” అని వారి చేతిలో పెట్టారు. ఇది వింతలో కెల్లా వింత.. అసలుసిసలైన వింత. ఎక్కడి అబ్దుల్ జాన్ పఠాన్ కాలం(1918) ఎక్కడి 2004వ సంవత్సరం!… బాబా అన్న మాట నిలబెట్టుకున్నారు. బాబా వారి పాదాలను అబ్దుల్ జాన్ పఠాన్ వద్దకు చేర్చారు. ఆదమ్ జాన్ పఠాన్ (అబ్దుల్ జాన్ పఠాన్ మనవడు) ద్వారా శ్రీ సాయి నిజ పాదుకా ముద్రలు కలిగిన బండ రాయి Korhale గ్రామం చేరింది. తదుపరి అక్కడి వారు ఎవరిని అధిక మొత్తంలో విరాళాలను అడగకుండానే సాయిబాబానే మందిరం కట్టడానికి కావాల్సిన డబ్బును కుడా సమకూర్చడం వల్ల ఇప్పుడు అక్కడ (Korhale లో) ఒక అందమైన సాయి బాబా మందిరం కట్టబడినది. ఎంతటి ఆశ్చర్యము.. బాబా లీలలు అంతే ఉంటాయి. శ్రీ బాబా శ్రీ బాబానే! వారికి వారే సాటి. బాబా వస్తువులు ఎన్నో..ఎన్నెన్నో Sansthan వారి Museum లో చేరాయి, భద్రపరచబడ్డాయి.ఈ ఒక్క నిజ పాదుకా ముద్రలుపడిన బండ తప్ప. అది ఎప్పటికీ అబ్దుల్ జాన్ పఠాన్ వారిదే!

మా మిత్రులు కీర్తి వల్లభ గారి సేకరణ. 

అల్లు జయశ్రీ

Friday, January 1, 2021

*ఓంశ్రీ సాయిరాం*

నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా 
దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం 
ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది .

ప్రతీ సాయిభక్తుల గృహాలలోను ,కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది .ఈ పటానికి రూపుదిద్దినవాడు 
ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు 
అయిన శ్యామరావు జయకర్ .

సుమారు 1916 
సం .ప్రాంతంలో జయకర్ తన భార్యా ,పిల్లతో 
సహ సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు .జయకర్ 
బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని 
బాబాను ప్రార్దించాడు .అది విన్న బాబా " అరే ! 
పిచ్చి బిచ్చగాడిని .నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు ? " అన్నారు .చివరికి బాబా తన 
చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు .

సాయి 
ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం ,ద్వారకమాయిలో 
ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది .జయకర్ గీసిన చిత్రం ,సాయిసచ్చరిత్ర తోనూ ,బాలాజీ వసంత్ 
తాలిమ్ మలచిన సమాధిమందిరం లో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును .

సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు 
తప్పవు .జయకర్ షిరిడీలో ,సాయిసన్నిధిలో ఉండే సమయములో ,మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు .శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో  ,బాబా ముందు తన బాధను 
వినిపించింది .బాబా ఆమెను ఓదారుస్తూ ,విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది .
కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు 
గదా ! 

ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది .
బాబా జయకర్ భార్యతో " దిగులు చెందకు !
నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు .

బాబా వాక్కు బ్రహ్మ వాక్కు .అది 
కేవలం ఊరడింపు మాట కాదు .అది సత్యమే అయి తీరుతుంది .విధిని కూడా ఎదిరించగల శక్తి 
బాబాకు వుంది .బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు ,బాబా మహా సమాధి అనంతరం 
1920 సం .లో ఒక బిడ్డ జన్మించాడు .ఆ బిడ్డకు 
ఆ దంపతులు " రామ్ " అని పేరు పెట్టారు .
సాయబాబా ఒక చేతితో  మన కర్మానుసారం తీసివేసినా ,
మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు .

*దానికి ఆయనయందు అచంచల విశ్వాసం,ఓర్పు ఎంతో అవసరం* .

🌹 *"నేనే దైవాన్ని", " నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు!", నీవు చూచేదంతా కలిపితే నేను!", - "ఎవరైతే ఈ మూడున్నర మూరల దేహాన్నే 'సాయి ' అని అనుకోంటారో వారసలు 'సాయి'ని చూడనట్లే!", "నా మట్టి మాట్లాడుతుంది;

 నా సమాధి సమాధానమిస్తుంది!", "నా భక్తులు కోరినవన్నీ యిస్తాను; నేనివ్వదలిచింది వారడిగేంతవరకు!"* --- అన్న శ్రీసాయి యొక్క అసలు తత్త్వమేమిటి? శ్రీసాయి యొక్క భక్తరక్షణపరతంత్రతకు, భక్తపరాయణత్వానికి మూలమైన ఆయన అవ్యాజప్రేమతత్త్వానికి  పునాదులేమిటి? శ్రీసాయి తమ మాట ద్వారా, చేత ద్వారా మానవాళికందించిన మహిత ప్రబోధమేమిటి? *"

మా సంప్రదాయమే వేరు!"* అన్న శ్రీసాయి యొక్క అసలైన సంప్రదాయమేమిటి? శ్రీసాయి ఆవిష్కరించిన ఆ విశిష్ట సంప్రదాయానికి నిజమైన వారసులమై, శ్రీసాయి ప్రేమను, రక్షణను ఇంకా ఇంకా అపారంగా పొందేందుకు మనమేం చేయాలి? -

- మొ||న ప్రశ్నలను జిజ్ఞాసతో మనకు మనం వేసుకొని, వాటికి సమాధానాలను శ్రీసాయిచరిత్రలో శ్రద్ధగా అన్వేషించి అవగాహన చేసుకోవడమే --- *నిజమైన శ్రీసాయిచరిత్ర పారాయణ! "*

- *శ్రీబాబూజీ* (ప్రార్థనాపథం)