*ఓంశ్రీ సాయిరాం*
నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా
దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం
ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది .
ప్రతీ సాయిభక్తుల గృహాలలోను ,కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది .ఈ పటానికి రూపుదిద్దినవాడు
ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు
అయిన శ్యామరావు జయకర్ .
సుమారు 1916
సం .ప్రాంతంలో జయకర్ తన భార్యా ,పిల్లతో
సహ సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు .జయకర్
బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని
బాబాను ప్రార్దించాడు .అది విన్న బాబా " అరే !
పిచ్చి బిచ్చగాడిని .నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు ? " అన్నారు .చివరికి బాబా తన
చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు .
సాయి
ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం ,ద్వారకమాయిలో
ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది .జయకర్ గీసిన చిత్రం ,సాయిసచ్చరిత్ర తోనూ ,బాలాజీ వసంత్
తాలిమ్ మలచిన సమాధిమందిరం లో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును .
సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు
తప్పవు .జయకర్ షిరిడీలో ,సాయిసన్నిధిలో ఉండే సమయములో ,మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు .శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో ,బాబా ముందు తన బాధను
వినిపించింది .బాబా ఆమెను ఓదారుస్తూ ,విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది .
కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు
గదా !
ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది .
బాబా జయకర్ భార్యతో " దిగులు చెందకు !
నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు .
బాబా వాక్కు బ్రహ్మ వాక్కు .అది
కేవలం ఊరడింపు మాట కాదు .అది సత్యమే అయి తీరుతుంది .విధిని కూడా ఎదిరించగల శక్తి
బాబాకు వుంది .బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు ,బాబా మహా సమాధి అనంతరం
1920 సం .లో ఒక బిడ్డ జన్మించాడు .ఆ బిడ్డకు
ఆ దంపతులు " రామ్ " అని పేరు పెట్టారు .
సాయబాబా ఒక చేతితో మన కర్మానుసారం తీసివేసినా ,
మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు .
*దానికి ఆయనయందు అచంచల విశ్వాసం,ఓర్పు ఎంతో అవసరం* .
🌹 *"నేనే దైవాన్ని", " నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు!", నీవు చూచేదంతా కలిపితే నేను!", - "ఎవరైతే ఈ మూడున్నర మూరల దేహాన్నే 'సాయి ' అని అనుకోంటారో వారసలు 'సాయి'ని చూడనట్లే!", "నా మట్టి మాట్లాడుతుంది;
నా సమాధి సమాధానమిస్తుంది!", "నా భక్తులు కోరినవన్నీ యిస్తాను; నేనివ్వదలిచింది వారడిగేంతవరకు!"* --- అన్న శ్రీసాయి యొక్క అసలు తత్త్వమేమిటి? శ్రీసాయి యొక్క భక్తరక్షణపరతంత్రతకు, భక్తపరాయణత్వానికి మూలమైన ఆయన అవ్యాజప్రేమతత్త్వానికి పునాదులేమిటి? శ్రీసాయి తమ మాట ద్వారా, చేత ద్వారా మానవాళికందించిన మహిత ప్రబోధమేమిటి? *"
మా సంప్రదాయమే వేరు!"* అన్న శ్రీసాయి యొక్క అసలైన సంప్రదాయమేమిటి? శ్రీసాయి ఆవిష్కరించిన ఆ విశిష్ట సంప్రదాయానికి నిజమైన వారసులమై, శ్రీసాయి ప్రేమను, రక్షణను ఇంకా ఇంకా అపారంగా పొందేందుకు మనమేం చేయాలి? -
- మొ||న ప్రశ్నలను జిజ్ఞాసతో మనకు మనం వేసుకొని, వాటికి సమాధానాలను శ్రీసాయిచరిత్రలో శ్రద్ధగా అన్వేషించి అవగాహన చేసుకోవడమే --- *నిజమైన శ్రీసాయిచరిత్ర పారాయణ! "*
- *శ్రీబాబూజీ* (ప్రార్థనాపథం)
No comments:
Post a Comment