Wednesday, May 15, 2024

సాయిబాబా మహా సమాధి చెందక పూర్వమే సాయి అనుజ్ఞతో నిర్మించిన ప్రప్రథమ సాయి మందిరం, మహారాష్ట్రలోని పుణే - కళ్యాణ్ రైలు మార్గములో భీవపురి అనే గ్రామములో కలదు.* *ఈ ప్రధమ సాయి మందిర నిర్మాణ కర్త శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్.* *సాయి నాధుడే ప్రత్యక్షంగా ఈ మందిరం లో ఉన్నట్లు భక్తులకు అనేక అనుభవాలు కలిగినవి.*

 *సాయిబాబా మహా సమాధి చెందక పూర్వమే సాయి అనుజ్ఞతో నిర్మించిన ప్రప్రథమ సాయి మందిరం, మహారాష్ట్రలోని పుణే - కళ్యాణ్ రైలు మార్గములో భీవపురి అనే గ్రామములో కలదు.*


*ఈ ప్రధమ సాయి మందిర నిర్మాణ కర్త శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్.*


*సాయి నాధుడే ప్రత్యక్షంగా ఈ మందిరం లో ఉన్నట్లు భక్తులకు అనేక అనుభవాలు కలిగినవి.*


*ఆ తరువాత మందిరము దర్శనం కొరకు భక్తుల ప్రవాహం అధికమైనది. వచ్చేవారికి కనీస సౌకర్యాలు కల్పించాలని రామచంద్ర ప్రధాన్ నిరంతరం ఆలోచించేవాడు.*

*1939 సం .లో ప్రధాన్ మరణించటంతో, మందిర నిర్వహణ బాధ్యత ఆయన అల్లుడు వి .వి .గుప్తే స్వీకరించాడు*  

*భక్తుల సౌకర్యములు ఏర్పాటుకు తగినంత డబ్బు లేక ఇబ్బంది పడేవారు.*

*అందుకని సాయి భక్తుడైన నారాయణ పురోహిత్ అనే వ్యక్తితో "శ్రీ సాయి సచ్చరిత్ర " పారాయణం ప్రారంభించారు.* *పారాయణలో శ్రద్ధను బట్టి ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు. పారాయణ ప్రారంభించిన మూడు, నాలుగు రోజులు తరువాత ఒకనాటి రాత్రి ఆ మందిర పురోహితునికీ బాబా స్వప్నంలో కనిపించి " నా ధుని ఎక్కడా ? ధుని లేనిదే షిరిడీ ఎలా కాగలదు ? "అని ప్రశ్నించారు.*

*ఇంకా అతనిపై రాళ్ళు రువ్వారు ఆ స్వప్నంలోనే. ఆ స్వప్నానికి పురోహితుడు ఆశ్చర్యపోయాడు.*

*జరిగిన సంఘటనకు కొంత ఉదాసీనంగా ఉండుట చూసి, మరునాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చి అతనిని హెచ్చరించాడు.*

*ఆ రోజు పారాయణం అనంతరం పురోహితుడు తన స్వప్న వృత్తాతంతం గూర్చీ, అక్కడకు దూరాన గల దాదర్ పట్టణంలో నున్న గుప్తే గారికి విన్నవించాడు.*

*అది విన్న గుప్తే కొందరి సాయి భక్తుల సహకారంతో ధుని నిర్మాణం జరిగిపోయింది. విచిత్రంగా కావలిసిన ధనం సమకూరింది.*

*8 అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు తో ధుని నిర్మితమైనది.*


*1949 సం .శ్రీరామ నవమి రోజున ఆ ధునిని సాయి సచ్చరిత్ర రచించిన హేమాడ్ పంత్ మనుమడైన శ్రీ AR వాల్వాల్కర్ చేతులచే ధుని ప్రారంభించబడినది.*

 

*సాయినాథుని లీలలకు అంతేమున్నది.*

 

*సాయి సేవక్ గా పిలువబడే శ్రీ శివనేశన్ స్వామి గారు షిర్దీలో ద్వారకామాయిలో గల ధునికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.*

*మనకు షిరిడీలో ముగ్గురు మాతలు ఉన్నారు అని అంటారాయన.*

*1 ద్వారకామాయి 2  సాయి మాత* 

*3  ధుని మాత.*


 *ధుని సాయి మందిరానికి కలికి తురాయి.*

*సాయి మందిరములో గల "ధుని మాతకు "ప్రణతులు అర్పిద్దాం.*

*పునీతులవుదాం.*

No comments:

Post a Comment