*సాయి విచిత్ర ప్రసాదం.*
*సాయినాథుని కరుణ ఏ విధముగా ఉంటుందో అని అంచనా వేయలేము.* *ఎప్పుడు, ఎవరిని, ఏ విధంగా కటాక్షించాలో ఆ స్వామికే తెలుసు. బాబాను అనన్యంగా సేవించిన భక్తురాలు లక్ష్మీబాయి సింథే.*
*బాబా తాను శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు లక్ష్మీబాయి కి తొమ్మిది రూపాయలు ఇచ్చాడు. వాటిని ఆమె ప్రాణప్రదంగా దాచుకొన్నది. ఇప్పటికీ ఆమె వారసుల వద్ద భద్రంగా వున్నాయి.*
*చందూలాల్ మెహతా అని గుజరాతి సాయి భక్తుడుండేవాడు.*
*ఆయన బాబాను ప్రత్యక్షంగా సేవించు కొన్న పరమ భక్తుడైన సాయి శరణానంద గారి అనుయాయుడు. విచిత్రంగా అందరిలాగా కాకుండా తన స్వస్థలము నుండి షిరిడీ ప్రయాణానికి, తనకు, తన కుటుంబానికి కావలసిన రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు సాయి ప్రసాదంగా కొన్ని ఏళ్లపాటు వచ్చేవి. ఆ టికెట్లతో ఆయన తన కుటుంబం తో ( నాలుగు ఫుల్ టికెట్లు, ఒక హాఫ్ టికెట్ ) షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొనేవాడు.*
*ఒకసారి మార్చి 15 వ తేదీ 1983 సం. న చందూలాల్ మెహతా, ఆయన భార్య శ్రీమతి మనూబాయి, ఆమె కుమార్తె తో కలసి అహ్మదాబాద్ నగరంలో కల సాయి శరణానంద సమాధిని దర్శించుకున్నారు. (సాయి శరణానంద సమాధి చెందినది 25 -8 -1982.* *సమాధిగల ప్రదేశం, పకృతి కుంజ సొసైటీ అహ్మదాబాదు ) శరణానంద గారి సమాధి పూజా కార్యక్రమాలు ముగిశాయి.* *పూజారి వారికి ప్రసాదం ఇవ్వడానికి ఒక తెల్లటి ప్లాస్టిక్ డబ్బాలో చేయి పెట్టాడు. అందులో చేతికి వచ్చిన సంచిని తీసుకొని వారి ముందే ఆ సంచి తెరువగా వారికి రైల్వే నాలుగున్నర వ్యక్తులు ప్రయాణం చేయడానికి గల రైల్వే టికెట్లు కనబడ్డాయి.*
*ప్రయాణపు తేదీ*
*30 -4 -1983 రైలు - నవజీవన్ express . అహ్మదాబాదు నుండి మన్మాడ్ వరకు బోగీ నంబర్ -S -13.*
*గతంలో కూడా షిరిడీ వెళ్లటానికి ఆ కుటుంబానికి ఎర్పాట్లు చేసారు కానీ ఎవరొ తెలియదు.*
*సాయిబాబా తప్ప వారిపై అంత శ్రద్ధ చూపేవారు ఎవరు వుంటారు ?. ఈసారి రైల్వే టికెట్లు స్వయంగా పూజారి ఇవ్వటం జరిగింది. ఇందంతా సాయినాథుని లీల అని గ్రహించి ఆనంద పరవశులైరి.*
*ఇది అపూర్వమైన వింతయే, కానీ చందులాల్ మెహతా సాయి ప్రసాదంగా భావించి ఆ టికెట్లు భద్రపరుచుకొని, వేరేగా రైలు టికెట్లు కొని షిరిడీ యాత్ర చేశాడు.*
*ఆ రైలు టిక్కెట్లు లక్ష్మీబాయి సింథే కి ఇచ్చినటువంటి రూపాయల వంటివే.*
*సాయిబాబా భక్తులకు ఇచ్చే ప్రసాదాలు విచిత్రంగా ఉంటాయి.*
No comments:
Post a Comment