Tuesday, May 14, 2024

శ్రీ సాయీ నిత్య దైవ ప్రార్ధన

 *ఓం శ్రీ సాయీ నిత్య దైవ ప్రార్ధన.*


*కరుణామూర్తి యగు సాయీ ! మా చిత్తం సర్వకాల సర్వావస్థల యందును మీ పాదారవిందములందు లగ్నమై అచంచల మైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రహింపుము.*


*పరమ దయానిధీ సాయిబాబా ! ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండువరకు మనసు, వాక్కు, శరీరములచే మా వలన ఎవరికీ అపకారము కలుగకుండునట్లు, ఇతర ప్రాణులకు ఉపకారము చేయుకలుగునను సద్బుద్ధి దయచేయుము.*


*సచ్చిదానందమూర్తీ ! సద్గురూ ఓ షిర్దీసా !*

*మా అంతకరణము నందు ఎన్నడూ ఏ విధమైన దుష్ట సంకల్పం గానీ, విషయ వాసన గానీ, అజ్ఞాత వృత్తి గానీ జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము.*


*నింబవృక్ష మూలానివాసా అభయ స్వరూపా !* 


*మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజములు అంకురించి, శీఘ్రముగా వృద్ధిచెందునట్లు ఆశీర్వదించుము.*


*మరియు ఈ జన్మనందే కడతేరి మీ సాన్నిధ్యమునకు యేతెంచుటకు వలసిన శక్తి సామర్ధ్యములను కరుణతో వొసంగుము.*


*దాసగణు హృదయము నందు కలవాడవు !*

*దీనులపాలిటి కల్పవృక్ష స్వరూపుడవు !*

*నీవు తప్ప మాకు ఇంకెవరి దిక్కు !*

 *నిన్ను ఆశ్రయించితిని.*

*అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము !* *తమస్సునుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము !* *మృత్యువునుండి అమృతత్వం ను పొందచేయుము.* 


*మా వినతి అనుగ్రహింపుము నీ దరి చేర్చుకొనుము.*

*ఈ ప్రార్థన రెండు పూటలా స్మరించు వారికి సాయీశుని అనుగ్రహము తప్పక కలుగును.*


 *జ్ఞానరూపాయ విద్యహే అవధూతాయ ధీమహీ తన్నొ సాయి ప్రచోదయాత్.*

No comments:

Post a Comment