*సాయిబాబా ఎన్నో సందర్భాలలో తనకు, తన ఫొటోకు భేదం లేదని తెలిపారు.*
*ఒక భక్తుడు బాబా ఫొటోకు నమస్కరిస్తే, అతను నాకు నాలుగేళ్లనుండి తెలుసు అని షిరిడీకి వచ్చిన భక్తునిలో తెలిపారు.*
*బాబా సమాధి చెందక పూర్వము అనగా 1917 సం. ఫాల్గుణ మాస పౌర్ణమినాడు ( నేటికి నూట ఏడు సంవత్సారాల ముందు ) సాయిసచ్చరిత్ర రచయిత అయిన గోవింద్ రఘునాద్ దభోల్కర్ కు ( హేమడ్ పంత్ ) స్వప్న దర్శనమిచ్చి కలలోనే లేపి అతని ఇంటికి భోజనానికీ వస్తానని చెప్పారు.*
*హేమడ్ పంత్ బాబా మాటలు విశ్వసించి, అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు.*
*బంధుమిత్రులతో సహ భోజనానికీ సిద్ధం అయ్యారు.*
*బాబాకు ఒక ఆసనం ప్రత్యెకంగా ఏర్పాటు చేసారు.*
*అందరూ బాబా గురించి ఎదురుచూస్తుండగా, బాబా భక్తులైన అలీ అహ్మద్, ముజావర్ అనువారు వచ్చి ఒక పేపర్ పాకెట్ హేమడ్ పంత్ కు అందచేశారు.*
*అశ్చర్యం ఆ పాకెట్టు విప్పిచూడగా అందులో ఒక అందమైన, అద్భుతమైన బాబా చిత్రపటం కనిపించింది.*
*బాబా కొరకు ఏర్పాటుచేసిన పీటపై ఆ చిత్రపటం పెట్టి నివేదన చేసారు.*
*ఇప్పటికీ ఆ సుందరమైన చిత్రపటం ముంబయి లోని హేమాడపంత్ గృహంలో దర్శించుకొవచ్చు.*
*బాబా ఫొటోకు గానీ, విగ్రహానికి గానీ, ఏదైనా పదార్థం నివేదిస్తే అది బాబాకు అందుతుందని, జరిగిన ఈ బాబా లీల సాయిసచ్చరిత 40 వ అధ్యాయములో పారాయణ చేయవచ్చు.*
*సాయిబాబా హేమాడ్ పంత్ గృహమునకు 1917 సం. ఫాల్గుణ శుద్ద పౌర్ణమినాడు ఫోటో రూపములో వచ్చిన చిత్రపటం.*
No comments:
Post a Comment