🌹 *పరమ భక్తుడు* 🌹
*ఒకనాడు ఛోఖా మేళా మరికొందరితో కలసి ఒక గోడ కడుతుండగా, అనుకోకుండా అది కూలిపోయి చోఖా మేళా మరికొందరు ఆ గోడ శిథిలాల్లో పడిమరణించారు.*
*మరణించిన వారి మృతదేహాలను తీయడానికి చాలా సమయం పట్టింది.*
*అందరూ నిర్ణయించి ఆ మృతదేహాలకు సాముహిక దహనం చేశారు.*
*అప్పుడు మరొక పాండురంగ భక్తుడైన నామదేవ్ తో పాండురంగడు " ఛోఖా మేళా నా భక్తుడు. అతని సమాధి నా మందిరమునకు ఎదురుగా ఉండాలనే ఒకే ఒక్క కోరికతో జీవించాడు.*
*అతని కోరిక తీర్చుట నా లక్ష్యము " అని పలికారు.*
*అది విని నామదేవ్ పాండురంగనితో " స్వామీ !మరణించిన వారి ఎముకలలో, చోఖా మేళా ఎముకలను గుర్తించడం సాధ్యం కాదుకదా ! " అని జవాబిచ్చాడు*
*అందుకు పాండురంగడు నామదేవ్ తో " ఛోఖా మేళా ఎముకలు సహితం నా నామాన్ని ఉచ్ఛరిస్తాయి.* *జాగ్రత్తగా విను అని స్వామి పలికారు.*
*అదే విధంగా నామదేవుడు చోఖా మేళా తో పాటు మరణించినవారి ఎముకల గుట్ట దగ్గరకు వెళ్ళి ఒకొక్క ఎముకను చెవి దగ్గర పెట్టుకుని, ఏవి అయితే పాండురంగని నామస్మరణ చేసినవో, వాటిని ఏరి తీసుకొచ్చి, పండరీ పురంలో, పాండురంగని ఆలయం ఎదురుగా చోఖా మేళా సమాధిని నామదేవుఁడు నిర్మించాడు.*
*ఎప్పటికీ ఛోఖామెలా ఎముకలు పాండురంగ నామాన్నే ఉచ్చరిస్తాయి.*
*చోఖా మేళా వైశాఖ బహుళ పంచమి నాడు దేహాన్ని త్యజించాడు.*
*పండరీపురంలో చోఖా మేళా సమాధి నిర్మించారు.*
*నేడు వైశాఖ బహుళ పంచమి.*
*28 -5 -2024*
No comments:
Post a Comment