*"షిరిడీ మాఝే పండరీపుర, సాయిబాబా రమావర "*
*అంటూ సాయిబాబా ను కీర్తిస్తాడు దాసగణు మహరాజ్.*
*చాలా ఏళ్ళ క్రింద డాక్టర్ రామస్వామి అయ్యంగార్ మరియు అతని మిత్రుడైన బచ్చు పాపయ్య శ్రేష్టి తో కలసి షిరిడీ యాత్రను చేసారు.*
*రామస్వామిగారికి షిరిడి యే కాశీ క్షేత్రమనిపించింది.*
*దాసగణు మహరాజ్ కు షిరిడీ పండరీపురం అయినట్లు.*
*రామస్వామి గారికి ,షిరిడీ కాశీ క్షేత్రము గా భావన చేసినా, సాయి బాబాను విశ్వనాధునిగా సేవించి ఊరుకోలేదు.*
*కాశీ క్షేత్రము దర్శించినవారు తమకు ఇష్టమైన దానిని కాశీలో విడచి పెట్టుట సామాన్యంగా జరిగే విషయము.*
*రామస్వామిగారికి చిన్నప్పటినుంచి తమలపాకులు వేసుకోవటం అలవాటు.*
*అలాగే షిరిడీలో కూడా తమలపాకులు వేసుకోవడం విడచిపెడదాం అని నిర్ణయించుకున్నాడు."*
*మిత్రులిద్దరూ షిరిడీ దర్శించుకొని 27 -4 -1938 సం. నాడు తమ స్వస్థలములకు తిరుగు ప్రయాణం సాగించారు.*
*వారు షిరిడీ నుండి ఎద్దుల బండిలో ప్రయాణమయ్యారు.*
*పాపయ్య శ్రేష్టి కి కూడా తమలపాకులు వేసుకొనే అలవాటున్నందున, ఆయన తన పాన్ డబ్బా తీసుకొని యధావిధిగా తమలపాకులు వేసుకొంటున్నాడు.*
*అది గమనించిన రామస్వామి గారికి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అనిపించింది.* *తమలపాకులు వేసుకోవడం షిరిడీలో వదలి పెట్టే బదులు మద్రాసు ( నేటి చెన్నై ) లో విడిచిపెడితే బాగుంటుందని అని అనుకొని తన వద్దనున్న పాన్ డబ్బా తీసి ఆకు వక్కలు వేసుకొని నమల సాగాడు.*
*వెంటనే నోరంతా పొక్కి నాలుక పుండైనది. ఈలోగా బండి రహతా గ్రామం చేరుకోగానే, తన పాన్ డబ్బాను బండిలో ఉంచి తమలపాకులు కొని తెచ్చుకున్నాడు. డబ్బాలో తమలపాకులు పెడదామని చూస్తే డబ్బా కనబడలేదు.*
*శ్రేష్ఠిగారు బండిలోనే ఉన్నారు కాబట్టి వేరేవారు ఎవ్వరూ బండిలోనున్న డబ్బాను తీసుకువెళ్లే అవకాశమే లేదు.*
*రామస్వామి గారికి ఈ సంఘటనతో ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆయనకు నోరు, నాలుక స్వాధీనంలో లేక యే పదార్ధాన్ని మ్రింగ లేకపోయాడు.*
*అలా 18 రొజులు గడచిపోయాయి.*
*తన పరిస్థితికి కారణం తాను సాయికి ఇచ్చిన మాటను ఉల్లఘించి నందుకు అని తెలిసి పశ్చాతాపం చెందాడు.*
*సాయి బాబా తన ప్రతి మాటను, నడవడికను గమనిస్తున్నాడని తెలుసుకొన్నాడు. బాబాకు సంపూర్ణ శరణాగతుడయ్యాడు.*
*సాయిబాబా కు మొక్కుకోవడం తీర్చడం మున్నగు వాటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలుసుకొందాం.*
No comments:
Post a Comment