Sunday, May 26, 2024

సాయిబాబా శ్రద్ద - సబూరీలకు పెద్దపీట వేశారు.

*షిర్డీ సాయిబాబా శ్రద్ద - సబూరీలకు పెద్దపీట వేశారు.*

*షిరిడీలో 1909 సం.లో ప్రారంభమైన గురుపూర్ణిమ ఉత్సవాలు యధావిధిగా ప్రతీ ఆషాఢపూర్ణిమకు గురుపూర్ణిమ ఉత్సవాలు నేటికినీ కొనసాగుతునే వున్నాయి.*

*అలా 1914 సం. లో షిరిడీలో  గురుపూర్ణిమ సందర్భంగా విశేషముగా ప్రసాదాలు  తయారుచేస్తున్నారు.*

*ఆ సందర్భంగా సాయిభక్తురాలైన రాధాకృష్ణమాయి, మసాల దినుసులు పొడిచేసేందుకు ఒక పెద్ద రోలును తరలించవలసి వచ్చింది.*
*ఆ సమయములో ఆమెకు సహాయము చేసేందుకు ఎం .బి .రేగే  అను భక్తుడు అక్కడకు వచ్చాడు.*

*అదే సమయములో పురందరే అనే మరొక బాబా భక్తుడు ఆ పెద్ద రోలును కదలించడానికి వారితో కలిశాడు.*
*అలా ఆ రోలును కదిలించడంలో రేగే చెయ్యి ఆ రోలుక్రిందపడి నుజ్జయిపోయేది.*

*కానీ అది గమనించిన రాధాకృష్ణమాయి చాకచాక్యంగా ఆ రోలును తనవైపు తిప్పుకొని రేగెను కాపాడింది, అలా చేయడంలో ఆమె చూపుడువేలు రోలుక్రింద నలిగి రక్తం కారసాగింది.*

*వెంటనే ఆమె ఒక గుడ్డను నూనెలో తడిపి తన వేలుకు చుట్టుకొంది.*
*అలా ఆ తరువాత మిగిలిన కార్యక్రమము పూర్తిచేసి వంటల పని ముగించింది.*

*ఆ పని అంతా పూర్తిఅయ్యేక రేగెను వెంటబెట్టుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ తీరేదాకా షుమారు అరగంట సేపు విలపించింది.*

*తన వేలు చిట్లినప్పుడు, బాధతో విలపిస్తే మిగతా పనులు దెబ్బతింటాయని ఓర్పుతో భరించింది.*

*అపూర్వ కార్యదక్షతతో బాబాను సేవించిన ఆ భక్తురాలు చిరస్మరణీయురాలు.*

*శిర్డీసాయి బాబాను మనసావాచాకర్మణా అంకితమైన సుందరీబాయి క్షీరసాగర్ అనే రాధాకృష్ణమాయి ధన్యురాలు.*

No comments:

Post a Comment