Wednesday, May 15, 2024

సాయి పట్ల భక్తివిస్వాసాలే భక్తుని సిరిసంపదలు*

 *సాయి పట్ల భక్తివిస్వాసాలే భక్తుని సిరిసంపదలు* 

                             

*కొందరికి పూర్వపుణ్యం వలన ప్రయాస లేకుండానే సిరి సంపదలు, కీర్తి ప్రాప్తిస్తాయి అలాంటి వారికి మహాత్ములు తోనూ  భగవంతునితోనూ యేమి పని...*

*అసలలాంటి వారున్నారనే సృహ వారికి ఉండదు.*

 

*అలాంటివారిలో మహారాష్ట్రలో గొప్ప నాటకుడిగా కీర్తి గడించిన గణపత్రాప్ బోడస్ ఒకడు. అతడికి ఏ మహాత్ములయందూ గౌరవం గాని, విశ్వాసం గాని లేదు సరిగదా, అలాంటి వారిని పరిహసించేవాడు గూడా*. 


*ఒక సారి గణపత్రాప్ బోడస్ అహ్మద్ నగర్ లో పనిపడి కొద్ది రోజులు ఉన్నాడు. అక్కడ శ్రీ సాయిబాబా గురించి విన్నదగ్గరనుండి ఆయనను దర్శించాలని ఆకాంక్ష కలిగింది!*


*ఆ సంకల్పమును మితృడు మిరీకర్ తో చెప్పాడు. ఆ రోజులలో బలరామ్ మాన్కర్ కోపర్ గావ్ లో మమల్తదారుగా వుండే వాడు. అందువలన వారిద్దరూ కోపర్ గావ్ కు  చేరి రాత్రికి అక్కడ మిరీకర్ యింట నిద్ర చేశారు.*

 *మరురోజు బోడస్ శిరిడీ వెళ్ళాడు*. 


*మొట్టమొదట బోడస్ సాయిని ద్వారకామాయి లో దర్శించి ఆయనకొక కొబ్బరికాయ, ఎండు పొగాకు సమర్పించాడు. వెంటనే అతడిని ఆ పొగాకు తమ చిలింలో పెట్టి దాన్ని వెలిగించి ఇవ్వమన్నారు. తర్వాత తాపీగా దాని పొగ పీలుస్తూ ఆగంతకుడి క్లుప్తంగా క్షేమ సమాచారం విచారించారు.*

*మరుక్షణమే సాయి కంఠధ్వనిలోను, ముఖంలోనూ కొద్ది మార్పు వచ్చింది: "దక్షిణ యివ్వు! అన్నారు విసురుగా.* *ఆయన వైఖరికి ఆశ్చర్యపోయి బోడస్ ఒక్క రూపాయి సమర్పించారు.*

*దాన్ని తీసుకొంటూ సాయి, “భోజనం చేయకుండా వెళ్ళ వద్దు సుమా” అని యింకేవో సామాన్యమైన మాటలు మాట్లాడుతూ అకస్మాత్తుగా కోపంతో “వెధవల్లారా మీలో మీరు పోట్లాడుకు ఛస్తారేమి? "*ఇంక బాబా మీకేమి చేయగలడు?” అన్నారు.* *ఆ మాటలు ఇంకెవరికీ అర్ధం కాలేదు. ఎక్కడో భక్తులకేదో సమస్య ఎదురై ఉంటుందని అందుకే బాబా అలా అన్నారని అందరూ తలచారు.* 


*కానీ బోడస్ కి తక్షణమే* *అర్ధమైంది! కారణం సరిగ్గా* *రెండు రోజుల ముందే అతడు,* *తన చిరకాల స్నేహితుడైన జొగ్లేకర్ తగువులాడుకున్నారు.*

*బాబా అంటే ఏమిటో బోడస్ కు అర్థమైపోయింది* 


*అలా మధ్యాహ్న హారతి అయ్యాక ద్వారకామాయి వెనక ప్రక్క వున్న ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు బోడస్.*

*అక్కడ సాయి అతణ్ని దక్షిణ కోరారన్న మాటవిని ఒక భక్తుడు అతడితో “నీవు వెంటనే నీ వద్ద నున్న పైకమంతా ఆయన ముందు కుమ్మరించ వలసింది! ఎంతటి అవకాశాన్ని జారవిడుచుకున్నారా!"* *అన్నాడు*. 


*ఆ మాట యదార్థమనిపించి యీసారి అవకాశము వస్తే తప్పక అలాగే చేస్తానన్నాడు బోడస్.* 


*తర్వాత అతడు తిరుగు ప్రయాణమయి సాయి అనుమతి, ఆశీస్సులు కోరడానికై మసీదు చేరాడు*. *ఆ సమయంలో ఒక మంగలి సాయికి తల, గడ్డం మీసము క్షౌరం చేస్తున్నాడు. బోడస్ ఎంతో భక్తి ప్రపత్తులతో సాయికి పాదాభివందనం చేసాడు.* 


*“అయితే వెళుతున్నావన్నమాట!"* *అన్నారు బాబా*. 

*ఎంతో వివేకంతో సమయస్ఫూర్తితో - "మీ అనుమతి కోసం వచ్చాను బాబా" అన్నాడు బోడస్ “సరే వేళ్ళు! దక్షిణా కుక్షణా ఏమైనా ఇస్తావా?” అన్నారు బాబా అతడి వైపు చేయి చూపుతూ*


*బోడసకు కొండెక్కినంత సంతోషం వేసింది.* *తానెప్పుడొస్తుందో అనుకున్న సదవకాశం అంత అకస్మాత్తుగా తనకు రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తన పర్సులో ఉన్న పైకమంతా తీసి బాబా చేతిలో వుంచాడు.* 


*బాబా ఎంతో సంతోషంగా దానిని తీసుకొని, కొద్దిక్షణాలు తమ చేతిని అతని శిరస్సు మీద నుంచి ఆశీర్వదించి, నొసట విభూది పెట్టి, “నువ్వు నాకు సంతోషంగా దక్షిణి చ్చావు. నారాయణుడు నీకు సర్వం పుష్కలంగా ప్రసాదిస్తాడు” అన్నారు.*


*అతడు ఎంతో భారం తీరిన వాడిలా, ధన్యుడైనట్లు సంతోషంగా శిరిడీ విడిచి వెళ్ళాడు.* 


*సాయిమాట ఎన్నడైనా అబద్దమైతే గదా? ఎనలేని సిరిసంపదలు బోడసకు అనతికాలంలోనే సంక్రమించాయి. అదే అచంచలమైన గురుభక్తి!*


 *సాయి దర్శించాక వేరొక మహాత్మున్ని దర్శించనని అతడు నిర్ణయించుకున్నాడు.*


 *అందరు మహాత్ముల రూపమే ఆయనని అతని హృదయం గ్రహించింది!! తన సమకాలీనుడయిన ఆ ఫకీరును అంతలా విశ్వసించగల్గడంకంటే వేరే సిరిసంపద లేముంటాయి.*


*సాయిలీలా మాసపత్రిక*

No comments:

Post a Comment