Tuesday, May 14, 2024

మచిలీపట్నం నివాసి శ్రీ ఓ.వి.జి సుబ్రమణ్యం గారు షిరిడీ సాయి బాబాను, జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి " సాయి ది మదర్ అండ్ అనసూయ ది అమ్మా" అనే గ్రంథం ఆంగ్లములో వ్రాసారు.

 *జయహో మాతా*

 

*మచిలీపట్నం నివాసి శ్రీ ఓ.వి.జి సుబ్రమణ్యం గారు షిరిడీ సాయి బాబాను, జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి " సాయి ది మదర్ అండ్ అనసూయ ది అమ్మా" అనే గ్రంథం ఆంగ్లములో వ్రాసారు.*


*ఇద్దరు మహనీయుల గూర్చి, ఆ ఇద్దరూ ఒకే దివ్య శక్తి వేర్వేరు రూపాలలో, ఆయా ప్రాంతాలలోని జనులను ధర్మ మార్గాన సంచరించేటట్లు చేసిందని ఆ గ్రంథ సారాంశం.*


 *ఆ ఇద్దరూ సర్వ దేవతామూర్తులుగా - ఎవరు ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలో భక్తులకు సాక్షాత్కరించారు.*

 *ఇద్దరికీ అన్నదానమంటే అమిత ప్రేమ. తమను నమ్మిన భక్తుల బాధలను తామే అనుభవించి, ఆర్తులను బాధా విముక్తులను చేసిన సంఘటనలు ఆ ఇరువురి జీవితాలలో పుష్కలంగా వున్నాయి.* 

*ఆ ఇద్దరూ పంచ భూతాలపైన వారికి గల అప్రతిహతమైన అధికారాన్ని సందర్భోచితంగా చూపారు. ఇద్దరూ దర్శన మాత్రం చేతనే ఇహ పర సుఖాలను రెండు చేతులా ఆశ్రీతులకు పంచారు.*

*తేడాలు లేకపోలేదు - అందులో ఒక తేడా - జిల్లెళ్లమూడి అమ్మ వివాహితురాలు.*

*కల్యాణ బంధం ఆధ్యాత్మిక అమృతవాహినికి దోహదం చేస్తుంది అని రుజువు చేసి, లోకానికి అభయం ప్రసాదించడానికి వివాహం చేసుకుని భర్తతో, సంతానంలో కలిగే కష్ట సుఖాల కెరటాలపై ఉయ్యాలలూగుతూ లోకాన్నంతా కన్న బిడ్డగా ప్రేమించి పరమ ఉన్నతిని పొందారు.*


*ఇక సాయి బాబా నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండి, విశ్వాన్నే తన కుటుంబంగా ఎంచుకొని, సర్వ జనుల యోగ క్షేమాలను తన అవతార కార్యంగా, నేటికీ విశిష్ట నిదర్శనం చూపుతున్నారు.*


*సాయిబాబా తనకోసం చేయించు కొనిన రొట్టెను కుక్కకు పెట్టారు.* *జిల్లెళ్లమూడి అమ్మ తనకు ఇచ్చిన ఆరు పూరీలను సంతోషముగా గంతులు వేసుకొంటూ వెళ్లి ఆకలితో వున్న పేదలకు పెట్టింది. వాళ్ళు తింటే తాను తిన్నట్లే.*


*అమ్మ మార్చి 28 ,1923 సం. న జన్మించారు.*


*జయహొ మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.*


*సేకరణ - సాయి @ 366 నుండి.*

No comments:

Post a Comment