దర్శనానికి భక్తుడు రాలేదని ఊదీని పంపించిన బాబా
చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే పేరు కలిగిన బాబా భక్తుడు ఒకరు ఉండేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. కొన్ని రోజులు నగర్ జిల్లా కలెక్టరుకు కార్యదర్శిగా పనిచేశారు. తరువాత సిన్నూర్ లో మామ్లేదారుగా పనిచేశారు. తరచూ బాబా దర్శన భాగ్యం కలుగుతుండేది. సిన్నూర్ నుండి తనకు చాలా దూరం బదిలీ అయింది. వెంటనే వెళ్లి చేరవలసినదిగా ఉత్తర్వులు వచ్చాయి. బాబా దర్శనానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. తాను కోపరగాం నుండే రైలులో వెళ్లాడు. కాని బాబా దర్శనానికి వెళ్లలేకపోవటంతో చాలా చింతించసాగాడు. తరువాత బండి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా కిటికీ ద్వారం నుండి ఒక కాగితపు పొట్లాం వచ్చి తనపై పడింది. విప్పి చూస్తే అందులో ఊదీ లాంటి పొడి కనపడింది. ఆ పొట్లాన్ని తాను జాగ్రత్తగా దాచుకున్నాడు. తరువాత కొన్ని రోజులకు బాబా దర్శనానికి వెళ్లే భాగ్యం కలిగింది. అప్పుడు బాబా తమకు తామే, *నీవు రాలేదని నీకు ఊదీ పంపించాను. నీకు చేరింది కదా?* అని అన్నారు. ఆ మాటలు విన్న గాడ్గిల్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తరువాత తాను ఆ ఊదీని ఒక తాయత్తులో పోసి ఉంచాడు. చివరి వరకు ఆ తాయత్తు తన వద్దే ఉండేది.
-- దీక్షిత్ డైరీ --
🌹🙏 *ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం* 🙏🌹

No comments:
Post a Comment