షిరిడి కే సాయి బాబా- 2భాగం
Shiridi ke Sai Baba- 2nd part https://bit.ly/2TOm5nV
शिरडी के साई बाबा -2 ఈ చలన చిత్రములో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వివరించడానికి ప్రయత్నం.....
* దీపావళి పండుగ రోజున చిన్న పాప కోసం ద్వారకామాయిలో అశ్రువులతో కూడిన నీటితో దీపాలను వెలిగించిన బాబా దృశ్యం అద్భుతం.
*ఆనందం తో పాప "దీపావళి మనాయి సుహని మెరే సాయి హాతో మే జ్యాదు కా పాని "పాటను ఆశా భోంస్లే చాలా బాగా పాడారు.
*శ్రీ సాయిబాబా 'అక్కా' అని పిలిచే భాయిజామాయి దేహ త్యాగ సమయంలో "పుట్టిన వాడు గిట్టక తప్పదు"అను విషయాన్ని శ్రీ సాయిబాబా ని "మామా "అని పిలిచే తాత్యా కు వివరించే క్రమంలో అందరికీ ఆ విషయం స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా గా చూపటం లో దర్శకుని ప్రతిభకు తార్కాణం .
*శ్రీ సాయిబాబా గారు చిన్న పిల్లలతో గోళీలు ఆడుతూ పాడుతూ ఉండటం. శ్రీ సాయిబాబా గారికి చిన్నపిల్లల పట్ల ప్రేమను చూపుతుంది.
*లోకమాన్య బాలగంగాధర తిలక్ పంపిన భగవద్గీత గురించి వివరించే క్రమం లో బాబా గారు గీతా ఖురాన్, బైబిలు అన్ని కూడా ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి అని చెప్పే సన్నివేశం అద్బుతం.
*శ్రీ సాయిబాబా తన శరీరాన్ని 3 రోజులు విడిచి వెళ్ళిన క్రమంలో భక్తులు అందరు కలిసి బాబా కోసం
"సాయి బాబా బోలో సాయి బాబా బోలో"
"डाग मग जग ये डोल रहा है आसान से मत डालो।"
ఆలపించిన పాట లో నటి నటులు అందరూ కూడా చాలా బాగా చేశారు అని చెప్పాలి.
*శ్రీ సాయి బాబా తన చేతినే గరిటేగా ఉపయోగించి బాగా వేడి ఉన్నవంటను చేసి భక్తులకు సహపంక్తి భోజనం ఏర్పాటు అన్నదానం చేసే విధానం చూడవలసిందే.
*వర కట్నం కారణంగా అగిన వివాహం తిరిగి జరిపించిన విధానం గాని తప్పక చూడాలి.
*కులకర్ణి ఇంటికి భోజనానికి వెళ్ళిన సన్నివేశం, బ్రహ్మ జ్ఞానం పొందాలంటే పంచేంద్రియాలు మీద నిగ్రహాన్ని పెంచు కోవాలని వివరించిన దృశ్యం గాని చాలా బాగున్నవి.
*హేమాదిపంత్ కు శ్రీసాయిసత్చరిత్ర రచించడానికి అనుమతిని ఇవ్వడం, బూటీ వాడా నిర్మాణానికి శ్రీమాన్ బూటికి అనుమతిని ఇచ్చే విధానం గాని చూడదగినవి.
*బూటి వాడా నిర్మాణం సమయంలో బాబా గారు కొన్ని మార్పుల సూచనలు ఇవ్వడం
* "తుహి ఫకీర్,తుహి రాజ
సాయినాథ్ తేరే హజారో హాత్"
"साईं नाथ तेरे हजारों हाथ"
మొహమ్మద్ రఫీ , ఉషా మాంగేశ్కర్ గానం అద్బుతం.
*హీరా అనే అతనికి దృష్టిని ప్రసాదించే సన్నివేశం చాలా బాగా చిత్రీకరించారు.
*తాత్యా కు వ్యాధి మరియు శ్రీసాయి బాబా మహా సమాధి సన్నివేశలను చాలా హృదయానికి హత్తుకొని విధంగా చిత్రించారు.
*షిరిడి కే సాయి బాబా చిత్ర నిర్మాణం గాని, దర్శకుడు అయిన అశోక్ వి. భూషణ్ గారి దర్శకత్వ తీరు అద్భుతం అని చెప్ప వచ్చును.
*ఎడిటర్ గా చేసిన ప్రముఖ రచయిత శ్రీ వి.వి.కామత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పి తీరాలి కథా కథనం లో ఎక్కడా కూడా భావం దెబ్బ తినకుండా అందరికీ కూడా బాబా గారి లీలలు చిరకాలం గుర్తు ఉండే విధంగా బాబా గారి ప్రతి లీలను అద్బుతం గా చూపే ప్రయత్నం లో సఫలీకృతం అయ్యారు.
*శ్రీసాయి బాబా గా నటించిన సుధీర్ దాల్వి ఆ పాత్ర లో ఇమిడి పోయారు.
*ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారు.
*శ్రీసాయి బాబా గారి భక్తులు అయిన ప్రతి ఒక్కరు కూడా జీవితం ఖచ్చితంగా చూడ వలసిన సినిమా ఇది.
*ఇందులో ప్రతి సన్నివేశం ద్వారా బాబా గారు మానవాళికి నేర్పిన జీవిత సత్యాలను గురించి తెలసుకోవాల్సిందే.
*అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడవలసినది మనవి చేస్తున్నాను.
*ఆ షిరిడి సాయి బాబా వారి ఆశీస్సులు సదా అందరి పై వర్షించాలని అభిలషిస్తున్నాను.
No comments:
Post a Comment