Thursday, May 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 18, 19 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 

18, 19 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు 
ఓం శ్రీ సాయి రామ్
1. నిచ్చెన దిగి వచ్చిన వానికి బాబా ఏమి ఇచ్చెను?
జవాబు) రెండు రూపాయలు.

2. హేమాది పంత్ దీక్షిత్ వాడా నుండి బుటీ వాడా దాటుచుండగా ఒక పాట వినిపించెను? దానిని రచించిన వారు ఏవరు?
జవాబు) ఏక్ నాథ్ మహారాజ.

3. హేమాది పంత్ ఏ వారము మొత్తము రామస్మరణలో గడపాలన అనుకొనెను?
జవాబు) గురువారము.

4. బాబూ సాహెబ్ జోగ్ బాబా చేతిలో ఏమీ పెట్టెను?
జవాబు) కలకండ ముక్క.

5. హారతి పూర్తి కాగానే భక్తులు ఎమని జయ జయ ద్వానాలు చేసేను?
జవాబు) శ్రీ సచ్చిదానంద సమర్ద సాయి నాధ్ మహరాజ్ కి జై.

6. బాబా కుడి వైపున ఎవరు ఉన్నారు?
జవాబు) శ్యామ.

7. శ్యామా ఇంటి ముందు కిటికీ లో ఏమి ఉన్నది?
జవాబు) ఏకనాధ భాగవతము.

8. బాబా శ్యామ ను ఎంత దక్షిణ అడిగెను?
జవాబు) 15 రూపాయలు.

9. సాఠే ఏ గ్రంథము పారాయణం చేసెను? జవాబు) గురు చరిత్ర.

10. హేమాది పంత్ ఎన్ని సంవత్సరాల నుండి పారాయణం చేసెను?
జవాబు) 40 సంవత్సరాల నుండి.

11. సాఠే ఏ సంవత్సరంములో షిరిడి కి వచ్చెను?
జవాబు) 1917.

🙏🌷🙏

18,19 వ అద్యాయము లు
1. సాఠే తనకు వచ్చన స్వప్నము ఎవరికి తెలియజేసెను?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్.

2. హేమాది పంత్ సాఠే కన్నా ఎన్ని సంవత్సరాల ముందు వచ్చెను ?
జవాబు) 7 సంవత్సరాలు.

3. ఖశాబా దేశ్ ముఖ్ గారి గ్రామం పేరు ఏమిటి ?
జవాబు) సంగమనేరు.

4. బాపూ సాహేబ్ దీక్షిత్ నిత్యము ఎన్ని గ్రంధములు పారాయణము చేసేవారు?
జవాబు) 4 గ్రంధములు.

5. హేమాది పంత్ నిత్యము ఏ గ్రంథము పారాయణము చేసేవారు ?
జవాబు) ఏకనాధ భాగవతము.

6 . బాబా అడిగిన15 రూపాయలకు బదులుగా శ్యామా ఏమి సమర్పించెను ?
జవాబు) 15 సాష్టాంగ నమస్కారములు.

No comments:

Post a Comment