శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
27 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు
ఓం శ్రీ సాయిరాం
💐
1. భోజనం ఎన్ని పదార్థములలో వచ్చెను?
జవాబు) (సాంజా, పూరి, అన్నం, పులుసు, పరమాన్నం.) 5 రకాలు.
2. ఢిల్లీ లో కౌన్సిలు సభ్యుని భార్య కు బాబా ఏమి చెప్పేను?
జవాబు) "రాజారామ్"
3. కపర్ధే భార్య భర్తలు ఎన్ని రోజులు షిరిడి లో వున్నారు?
జవాబు) భర్త 4 నెలలు, భార్య 7 నెలలు, 4+7=11 నెలలు.
4. ఏ భక్తుడు యొక్క కధ లో 27 వ అధ్యాయం ముగిసేను?
జవాబు) కపర్ధే.
5. 27 వ అధ్యాయం చివరి కధ లో ఏ సంబంధం తెలియుచున్నది?
జవాబు) గురు, శిష్యుల సంబంధము.
6. స్వాతంత్ర్యం సమర యొధుడు రాసిన పుస్తకం పేరు?
జవాబు) గీతారహస్యం.
7. బాబా ఏమి చేస్తూ నోరు, చేతులు కడుగు కొని వచ్చారు?
జవాబు) త్రేన్పులు చేయుచూ.
8. విష్ణు సహస్ర నామ పుస్తకము బదులుగా దేనిని ఇచ్చినారు?
జవాబు) పంచరత్న గీత.
9. 27 వ అధ్యాయం లో ఏ ఏ గ్రంథము ల పేర్లు వచ్చినవి?
జవాబు) 6 గ్రంధములు. (గీత రహస్యం, విష్ణు సహస్ర, పంచ రత్న గీత, ఏకనాథ భాగవతం, ఆద్యాత్మిక పంచదశ, రామాయణం.)
10. వర్షపు నీరు త్రాగి ఎవరు సంతోష పడతారు?
జవాబు) చాతక పక్షి.
11. సద్గురు పాదము ఆశ్రయించగానే ఏ ఫలములు లభించును?
జవాబు) త్రిమూర్తుల కు నమస్కరించిన ఫలము.
🌿🌷🌿27వ అద్యాయము
1. కాకా మహజని ఏ గ్రంథము బాబాకు ఇచ్చెను?
జవాబు) ఏకనాథ భాగవతము.

No comments:
Post a Comment