*శ్రీ సాయి సత్చరిత్రలో షిర్డీ అనే పేడకుప్ప కి ఒక్క వజ్రం దొరికింది అని చెప్పిన ఆనంద మహరాజ్ గారు చెప్పిన విషయాల్ని తెలుసుకుందామా....*
*ఆనందనాధ్ మహరాజ్*
ఈయన అక్కల్ కోటలో ఉన్న శ్రీ స్వామి సమర్ధ గారి శిష్యులు. శ్రీ సాయిబాబా వారి భక్తులు అయిన శ్యామా, నందురామ్ మార్వాడీ తరచూ వీరిని దర్శించుకుంటూ వుండే వారు. ఒకసారి శ్యామా, నందరామ్ ఆనంద్ నాథ్ మహరాజ్ గారిని దర్శించుకున్నా తరువాత ఆనంద్ నాథ్ మహరాజ్ గారు చిన్న పిల్లవాడిలా మారం చేస్తూ నన్ను సాయి దర్శనంకు నన్ను తీసువెళ్ళండి అని 95 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన శ్యామా మరియు నందరామ్ వెనుక పడ్డారు. వారు తీసుకొని షిర్డీ వచ్చారు. అప్పుడు ద్వారకామయిలో సాయికి ఎదురుగా కూర్చొని ఒకరితో ఒకరు ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి లేచి వస్తున్న ఆనందనాథ్ మహరాజ్ గారు ఇలా అన్నారు. ఈ షిర్డీ అనే పేడకుప్ప కి సాయి అనే కోహినూర్ వజ్రం దొరికింది అన్నారు.
*ఆనందనాథ్ మహరాజ్ గారు స్వామి శ్రీ అక్కలకోట మహరాజ్ గారితో*
ఆనందనాథ్ మహరాజ్ గారి చిన్నవయస్సులో ముంబై వెళితే స్వామి సమర్ధ గారు మాట్లాడినట్లు అక్కల్ కోట రమ్మని వినిపించింది.వీరు అక్కల్ కోట వెళ్లారు.స్వామి దగ్గర 6 సంవత్సరాలు వున్నారు.అనేక ఆధ్యాత్మిక విషయాలు, భజనలు, భోపాళీ, శ్లోకాలు రచించి స్వామి దగ్గర పాడుతుండేవారు.వీరికి వాక్-శుద్ధి ని కలిగి ఉండేవారు.స్వామి ఆజ్ఞ మెరకు ఈయన అక్కలకోట వదిలి వెళ్ళేటప్పుడు స్వామి సమర్ధ వారు స్వయంగా నోటిలోనించి ఆత్మలింగ పాదుకలు ఇచ్చి వేగుర్ల అనే ఊరిలో మఠం స్థాపించి అక్కడ ప్రతిష్ట చేయమన్నారు.ఈ మఠం కోపర్గావ్ నుండి మన్మడ్ దగ్గరలో షిర్డీ వస్తుంది. యోలా నుండి 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో పాదుకలు స్థాపించబడి అక్కడ ఒక మఠం కూడా స్థాపించ బడింది. ఈ మఠం స్థాపించి సుమారుగా 125 సంవత్సరాలు, 1903సంవత్సరంలో వేగుర్ల లో వీరు సజీవ సమాధి చెందారు.వీరిని ఆనంద భువ అని పిలిచే వారు. అదే పేరుతో వీరు ప్రసిద్ధి చెందారు.ఈ పాదుకల దర్శనం కేవలం ఒక్క గురువారం రోజు మాత్రమే ఉంటుంది. గురువారం రోజు ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వరకు మాత్రమే ఉంటుంది.ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది.



No comments:
Post a Comment