*సుచిర్ స్మృతిలహరి గ్రహించిన కథలు ప్రత్యేకమైన మరియు అసలు ఊహించనటువంటి సంఘటనలతో నిండి ఉంటాయి. కానీ, కొన్నిసార్లు ఇవి మన నిజజీవితంలో సంఘటన అయితే మరింత అనూహ్యమైనది గాను భావవ్యక్తీకరణదిగాను ఉంటాయి.నిజానికి, సద్గురువు యొక్క గొప్ప ప్రభావంతో అనుసంధానించబడిన కథలు చాలా ప్రత్యేకమైనవి. మనసుకు హత్తుకునేవిగా వుంటాయి.ఈ క్రింది స్మృతిలహరిలో ఇది నిరూపించబడుతుంది.*
నవంబర్ 8, 1946వ సంవత్సరంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక సంఘటన జరిగింది, అది ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతుంది. కోపర్‌గావ్ మార్కెట్ నుండి ఒక ఫరలాంగు దూరంలో ఉన్న గోదావరి నది , భారీ విస్తీర్ణంతో ప్రజల కోసం నిర్మించిన బడిన రోడ్లు మోకాలి లోతులో ప్రవహించే బురదనీరు,చంద్రుని మసకబారిన మబ్బుల కాంతిలోచూడవచ్చు.గుఱ్ఱపుబండి వీటన్నిటి మధ్యలో వేగంగా నడపబదుతుంది. ఏ క్షణంలోనైనా మేము ప్రయాణిస్తున్న బండి మేము ప్రయాణిస్తున్న మార్గం నుండి మళ్ళీ అసురక్షిత మార్గంలో ప్రయాణించి కూలిపోతుందని మేము నలుగురు భయపడ్డాము. ఇవన్నీ నా కళ్ళ ముందు ఇంకా కదులు తున్న సంఘటన.నేను గత ఒకటిన్నర సంవత్సరాలుగా షిర్డీకి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నాను. కానీ, వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. చివరగా, 1946 నవంబర్ 8 న, దసరా పండుగ తరువాత, నేను డాక్టర్ కేశవ్ భగవంత్ గవాంకర్ (అన్నాసాహిబ్ గవాంకర్) మరియు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆరోజు సాయంత్రం బోరిబందర్ స్టేషన్ నుండి షిర్డీకి బయలుదేరాము. రైలు మన్మాడ్ చేరుకునే సమయానికి వర్షం పడటం మొదలయ్యింది. మేము మన్మాడ్ చేరుకున్నప్పుటికి చిన్నచిన్న చినుకులు పడుతున్నాయి, కాని, మేము దౌండ్ - మన్మడ్ లైన్ లో రైలు ఎక్కే సమయానికి, వర్షం ఆగిపోయింది.మేము కోపర్‌గావ్ వద్ద రైలు నుండి రాత్రి 9.30 గంటల సమయలో దిగి, ఆకాశంలో ఎటువంటి మబ్బులు లేకుండా స్వచంగా కనిపించింది.వెన్నెల వెలుగును కూడా చూశాము.వాతావరణం మొత్తం ప్రశాంతంగా, ఆనందదాయకంగా ఉంది. నిజానికి డాక్టర్ గవాంకర్ ఒక లేఖ రాయడం ద్వారా ముందుగానే ఒక గుఱ్ఱపుబండి వస్తుంది అనుకున్నాము, కాని, అది రాకపోవడంతో, మేము షిర్డీ వరకు మరో గుఱ్ఱపుబండి మాట్లాడుకుని ప్రయాణము ప్రారంభించాము. మేము కోపర్గావ్ మార్కెట్ చేరుకునే సరికి అక్కడ కొంత సమయం ఆగి ఆల్ఫారం తీసుకోని అక్కడే కొంత సమయం విశ్రాంతి తీసుకొని చివరికి అక్కడి నుండి రాత్రి 11.00 సమయంలో షిర్డీ బయలుదేరాము. మేము గుఱ్ఱపుబండి లోకి ఎక్కబోతున్నప్పుడు గుఱ్ఱపుబండి నడుపుతున్న రౌతు ప్రవహన్నీ గమనించి... ఈ సమయంలో భారీగా వర్షం పడుతుండటంతో, నది ప్రవాహం అకస్మాత్తుగా పెరిగిందని ఈ రాత్రి సమయంలో బండిని దానిపైకి తీసుకెళ్లడం సాధ్యం కాదని మాకు చెప్పారు. మొదట మేము అతని మాటలు నమ్మలేదు. అతను పూణేలో బండి నడిపే వాడు లాగానే అబద్ధం చెప్పాడు అనుకున్నాము. అందువలన మమ్మల్ని నది ఒడ్డు వరకు అయిన తీసుకెళ్లమని అడిగాము. అక్కడికి చేరుకున్నప్పుడు, నదిలో వరదనీరు మరియు బురద బారికేడ్ల ద్వారా పొంగిపొర్లుతున్నట్లు చూశాము. దానితో పాటు మోకాళ్ల లోతు వరకు నీరు ప్రవహించడంతో వెళుతున్న మార్గం అసలు చూడలేపోతున్నాము. మా బండి చక్రం ఒక వైపున కొద్దిగా ఒరిగిపోయి ప్రయాణీకులతో పాటు మా బండి నీటిలో పడిపోతుంది ఏమో అనే విషయం మాకు స్పష్టంగా తెలుస్తుంది .ఈ నది గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వర్షం తగ్గిన వెంటనే, నది పూర్తిగా ఎండిపోతుంది. కానీ సమీపంలో ఉన్న కొద్దిపాటి వర్షపాతం వలన నది నీటితో నిండి పూర్తి వేగంగా ప్రవహిస్తుంది. అటువంటి సమయంలో నీటి మట్టం ఎంత పెరుగుతుందో తెలుసుకోలేము. అందువలన ఈ విషయంలో ముందకు సాగే ధైర్యం లేదు. పరిస్థితిని గమనించిన తరువాత, మేము మా బండివాడు చెప్పిన విషయం నిజాం అని తెలుసుకున్నాము. కాని అక్కడ ఆగి ఉండటానికి అనుకూలమైన స్థలం లేనందువలన మేము కోపర్‌గావ్‌లో బస చేయడానికి సిద్ధంగా లేము.మేము కూడా వీలైనంత త్వరగా షిర్డీ వెళ్లిపోవాలని ఆసక్తితో ఉన్నాము.మా అందరి తీసుకువెళుతున్న నాయకుడు డాక్టర్ గవాంకర్ ఉన్నతమైన భక్తి నమ్మకం కలిగిన గొప్ప సాయిభక్తడు. బాబాపై ఆయనకున్న నమ్మకం ఎంతగా ఉంది అంటే అది వర్ణించలేము, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు సాయిబాబా యందు నమ్మకంతో నిర్భయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారు. అతని ఈ నమ్మకం,విశ్వాసం ఇక్కడ కూడా మనకు రక్షణనిస్తుంది. అతను గుఱ్ఱపురౌతు తో, "మీరు బండిని నిర్భయంగా నడుపమన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, నేను బాధ్యత తీసుకుంటాను" అని చెప్పారు. కానీ బండి నడిపే రౌతు ఇలా అన్నారు, "మీరు బాధ్యత వహిస్తారు సరే సాహెబ్, కానీ, గుఱ్ఱం కాళ్ళు నీటిలోకి వెళితే, బండికూడా నీటిలో పూర్తిగా ములిగిపోతుంది.గుఱ్ఱం కూడా చనిపోతుంది అలా జరిగితే నేను నా కుటుంబం ఇంకా ఆకలితో ఉండాలి అన్నారు. మార్కెట్‌లోని ఉన్న వారు అందరి రౌతుల కన్న ఎక్కువ ధర ఇచ్చినా బండిని నదిలోకి తీసుకెళ్లవద్దని నాకు సలహా ఇచ్చారు. లేకపోతే, నాకు వచ్చిన చెల్లింపును నేను ఎలా తిరస్కరించాను? "కానీ డాక్టర్ గవాంకర్ తన సంకల్పంతో దృడవిశ్వాసంతో ఉన్నారు. అతను అప్పుడు రౌతుకి గట్టిగా చెప్పారు, "మేము అతని ఆదేశాల మేరకు బాబా దర్శనం కోసం వెళ్తున్నాము. మీ గుఱ్ఱపుబండి నదిని దాటి సురక్షితంగా మరొక వైపుకు వెళ్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు బాబా నామాన్ని చేస్తూ గుఱ్ఱపుబండిని ముందుకు తీసుకెళ్లండి. ఇవన్నీ ఉన్నప్పటికీ , మీ గుఱ్ఱపుబండి ప్రమాదానికి గురైతే, బండికి ఎంత ఖర్చు అవుతుందో అలా అయిన పూర్తి మొత్తాన్ని నేను మీకు చెల్లిస్తాను. "అతను రౌతుకి తన వద్ద ఉన్న డబ్బుల పర్స్ కూడా చూపించారు. ఈ మాటల జరిగిన తర్వాత బండి నడిపే వాడిలో మార్పు వచ్చింది. ఈ చర్చ అంత ఒక మాయాజాలంలా జరిగింది. అతను మ్మమ్మల్ని అందరి బండిలో కూర్చోబెట్టాడు. మేము కూడా బండిలో భయంతో కూర్చున్నాము, కాని, డాక్టర్ గవాంకర్ చెప్పిన మాట్లలు ఆయన ఇచ్చిన హామీల ద్వారా మాలో కొత్త ఉత్సాహం వచ్చి
బండి ముందుకు కదిలింది. కింద బురద నీరు ప్రవహిస్తోంది.గుఱ్ఱం కాళ్ళ నుండి వస్తున్న బురదనీరు వెనుక కూర్చున్న మా బట్టలపై కొన్ని నీటి చుక్కలులా పడుతున్నాయి. పొగమంచు, చంద్రకాంతితో నది పూర్తిగా విస్తారమై ప్రశాంతవాతావరణం తో ఈ సమయంలో నిశబ్ధంగా ఉంది. మేము మా ప్రాణాలను మా చేతుల్లో పెట్టు కొని బాబా వారి నామాన్ని మా పెదవులతో పట్టుకొని ప్రతి క్షణం లెక్కిస్తూనే ఉన్నాము. మేము 4 - 5 నిమిషాల్లో సురక్షితంగా నది మరో వైపుకు చేరుకున్నాము. "శ్రీ సాయి మహారాజ్ కి జై" అనే మా కేకతో గాలిలో వాతావరణ నిండిపోయింది. గుఱ్ఱపుబండి నడిపే రౌతు ఆశ్చర్యపోయాడు. గవాంకర్ గారి తో "డాక్టర్ సాహెబ్, నేను చాలాకాలంగా ఈ బండి నడిపే పని చేస్తున్నాను .నేను చేసిన ఈ పనిలో వేలాది మందిని చూసాను, కలుసుకున్నాను, కానీ మీలాంటి నిర్భయ ధైర్యవంతుడిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఈ బండిని నేను స్వయంగా నడీపే పని చేయలేదు .నా స్వంతంగా బండి నడపడానికి నాకు ధైర్యం లేదు. డాక్టర్ సాహెబ్ నవ్వుతూ, *"ఇది నా ధైర్యం కాదు. నేను బాబాపై పెట్టుకున్న పరిపూర్ణ నమ్మకం,విశ్వాసం కలిగి ఉండడం వలన ఈ ధైర్యాన్ని చూపించాను.* "మేము తెల్లవారుజామున 1.30 గంటలకు షిర్డీకి చేరుకున్నాము. అక్కడికి చేరుకున్న తరువాత, నదిలో వరద ఎక్కువ కావడంతో కోపర్ గావ్ కు వెళ్ళలేదని మాకు తెలిసింది.మా మనస్సులలో సాయిబాబా వారే మేము షిర్డీ చేరుకోవడానికి సహాయపడ్డారు. మేము బాబాపై ఉంచిన నమ్మకంతో నదికి అడ్డంగా వెళ్ళాము. కాబట్టి, మన సద్గురు మమ్మల్ని అడ్డంగా తీసుకెళ్లేటప్పుడు ఎంతో తీవ్రవేగంతో ప్రవహించే నదిని సురక్షితంగా దాటించారు.
*శ్రీ సాయిలీలా - 1948*

No comments:
Post a Comment