ఈ పైన కనిపిస్తున్న శ్రీ సాయిబాబా వారి ఫోటోను 1912 వ సంవత్సరంలో గోపాల్ దినకర్ జోషి అనే భక్తుడు తీశారు.ఉదయం అల్పాహారం తర్వాత ప్రతి రోజు శ్రీ సాయిబాబా వారు లెండి బాగ్ కు వెళుతువుండేవారు. సాటేవాడాలో వుండే భక్తులు శ్రీ సాయిబాబా వారి ఊరేగింపు వాడా ముందు ఉన్న మూలకు చేరుకోవడాన్ని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తారు. అలా చేరినప్పుడు భక్తులు అందరు శ్రీ సాయిబాబా దర్శనం పొందవచ్చు. ఆ మలుపు వద్ద భక్తులు ఎదురుచూస్తున్న చూపులను శ్రీ సాయిబాబా గ్రహించి వారి కోరికను తీర్చుటకు శ్రీ సాయిబాబా వారు కొద్దిసేపు అక్కడ నిలబడి అందరికి దర్శనము ఇచ్చే విధంగా ఉండేది.
జోషి అనే వ్వక్తి శ్రీ సాయిబాబా ఫోటో తీయడం కొరకు అతను తన కెమెరాను అమర్చారు.బాబా వారు లెండి బాగ్ నుండి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా చేసే ముందు బాబావారి ఫోటో తీయడానికి అనుమతి కోరారు.అప్పుడు శ్రీ సాయిబాబా ఇలా చెప్పారు...... "నాకు నా ఛాయాచిత్రం(ఫోటో) వద్దు, కానీ మీరు ఖచ్చితంగా ఫోటో తీయాలి అనుకుంటే నాతో పాటు ఉన్న భక్తుల ఫోటో తీయవచ్చు". అన్నారు.
లెండి బాగ్ నుండి శ్రీ సాయిబాబా తిరిగి వచ్చిన తరువాత, అతను సాటేవాడా దగ్గర కొద్దిసేపు నిలబడ్డారు. జోషి శ్రీ సాయి ఫోటో తీయడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీ సాయిబాబా ఫోటో తీశారు. ఇది చూసిన షామా, శ్రీ సాయిబాబాకి జోషి తన ఫోటో తీసినట్లు చెప్పారు. అప్పుడు బాబా పైన చెప్పిన అదే మాటను మళ్ళీ చెప్పారు. “నాకు నా ఛాయాచిత్రం(ఫోటో) అవసరం లేదు. నేను ఏమి చేయాలి? ”.
జోషి ఫోటో ముద్రించి చూసి ఆశ్చర్యపోయారు,ఆ ఫొటోలో శ్రీ సాయిబాబా కనిపించలేదు,....ఆ ఫోటోలో శ్రీ సాయిబాబా వారి దివ్య చరణములు మాత్రమే కనిపించాయి(పైన ఫొటోలో మనం గమనించిన చరణములు కనిపించ లేదు.). గొడుగు, భగోజీ షిండే ,ఇతర భక్తులు స్పష్టంగా కనిపిస్తాయి కాని శ్రీ సాయిబాబా వారు నిలబడి ఉన్న స్థానంలో ఒక ప్రకాశవంతమైన కాంతి మాత్రమే కనిపిస్తుంది. పాదాలు మాత్రం చూడవచ్చు. (సాయి లీలా మ్యాగజైన్ 4 వ సంవత్సరం, అంక 4-5 జేష్ఠ మరియు ఆషాడ ఏకాశి 1848 (1826) చూడండి) - (మూలం: షిర్డీలో అంబ్రోసియా,విన్నీ చిట్లూరి రాసిన బాబా యొక్క గురుకులం ).

No comments:
Post a Comment