బాబా సజీవముగా వున్నప్పుడు ద్వారకామాయి ఇరువైపుల అనేక షెడ్లు ఉండేవి. ఆ షెడ్లు వున్న స్థలములోనే ఇప్పుడు సంస్థానము వుంది. అందున్న ఒక షెడ్లో బడి ఉండేది. బాబా ముఖ్య భక్తుడైన మాధవరావు దేశపాండే (శ్యామా) అందులో టీచరుగా పని చేసేవాడు. శ్యామా చెప్పిన దాని ప్రకారము “ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మశీదులో బాబా ఒక్కరే వుండేవారు. బడి కిటికీనుంచి మశీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మశీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడటం వినిపించేది. అది బాబాయే అయివుండాలి, కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కల్గింది."
బాబా సంస్థానము అభివృద్దికి కారణమైన ముఖ్య భక్తురాలు రాధాకృష్ణమాయి ఇంకొక షెడ్లో వుండేది. బాబా మొదటిగా షిరిడికి వచ్చిన భక్తులను పరిక్షీంచడానికి రాధాకృష్ణమాయి బడి దగ్గరకి పంపించేవారు. అబ్దుల్ బాబా కొంతకాలం ఇక్కడ వున్నాడు. ఔరంగాబాద్‌కి చెందిన సకారామ్ భార్యకు 27 సంవత్సరములైనా సంతానము కలుగలేదు. బాబా ఆశీస్సులతో వారికి ఒక బిడ్డ జన్మించాడు. సకారామ్ సంతోషముతో రూ 500/- బాబాకు సమర్పించుకున్నాడు. ఆ డబ్బుతో గుర్రము(శ్యామ్ సుందర్/ శ్యామ కర్ణి) కి ఒక షెడ్ నిర్మించారు. 1999 సంవత్సరం తరువాత షెడ్‌ని తీసి పారాయణము హాలుగా మరియు స్టొరేజ్ హాలుగ అభివృద్ది చేసారు. ఈ పారాయణ హాలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే వుంటుంది. 🌻🌺🌹ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🌻🌷🌼

No comments:
Post a Comment