మాధవరావ్ అడ్కర్ సాయిబాబా ను గురుదేవులుగా తలంచిన ఆ నాటి భక్తులలో ఒకరు. వీరు దాసుగణు మహరాజ్ స్నేహితులు లాగా మెలిగేవారు. దాసుగణు మహరాజ్ ని పెద్ద సోదరునిలా అనుకొనేవారు. ఇద్దరు రచయితలు, ఎన్నో భజన గీతాలూ రాసి మధురమైన కంఠం తో పాడుతుండేవారు. వీరి యొక్క భజనలు, కీర్తనలు పాడే పద్ధతి ఎందరో భక్తులను ఆకర్షించేది. వీరిని దాసుగణు మహరాజ్ ఒకసారి షిరిడీ తీసుకుని వెళ్ళారు. బాబాను చూసిన వెంటనే బాబా ను గురుదేవులుగా తలచుకుంటూ షిరిడీ లో,బాబా సన్నిధి లో ఎక్కువగా గడిపేవారు. 1903-04 లో ఒకసారి షిరిడీ వెళ్లినప్పుడు ,ధ్యానం లో ఒకపాట ఆశువుగా రాగా కాగితం మీద రాసుకున్నారు. దానిని దాసుగణు మహరాజ్ కు వినిపించగా ఆయన ఎంతో ఆనందంగా, చాలా అందంగా రాసి, కూర్చుబడింది, అని మెచ్చుకున్నారు. తరువాత ఇద్దరూ ఆ పాట కాగితం జేబులో పెట్టుకొని ద్వారకామాయి బాబా దర్శనానికి వెళ్ళారు. మాధవరావ్ అడ్కర్ జేబులోని కాగితం చూసిన శ్రీ సాయిబాబా, " అరే మాధవా! కాగితం ఏమిటి దాచిపెడుతున్నావు.తీసి పెద్దగా చదువు ",అన్నారు. అప్పుడు ఈ హారతి పాటను విన్న సాయి, "నువ్వు రాసిన ఈ పాట భక్తులను కాపాడుతుంది",అన్నారు.ఈ హారతి పాట రూపములో ఎప్పుడు నీతోనే వుంటాను అని మాధవరావ్ అడ్కర్ కి అభయం ఇచ్చారు. వీరు 1952సంవత్సరము దాకా దాసుగణు మహరాజ్ తో కలిసి ప్రతి శ్రీ రామనవమికి తప్పక షిరిడీ దర్శించేవారు. 1955 లో చివరి రోజుల్లో,..హారతి సాయిబాబా ...సౌఖ్య దాతార జీవ..పాట వారి అబ్బాయి పాడుతుంటే వింటూ బాబా ను చేరుకున్నారు. మధ్యాహ్న ,సాయంకాల హారతులలో పాడుకునే ఈ హారతి పాట ద్వారా సాయి భక్తుల హృదయాలలో నిలిచిపోయారు.🕉️

No comments:
Post a Comment