Thursday, May 21, 2020

ఓం శ్రీసాయి శ్రీ రామకృష్ణ శివమారుత్యాది రూపాయ నమః

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి .

" ఓం శ్రీరామకృష్ణ శివమారుత్యాది రూపాయ నమః ."
సాయినాధుడు రామునిగా ,కృష్ణునిగా ,శివునిగా ,
ఆంజనేయునిగా ఆయా భక్తులకు సాక్షాత్కరించెను .ఇంతేకాదు ,అయన విఠోబా 
రూపములో ,ఖండోబా రూపములో ,ఇంకను 
పెక్కు రూపములలో భక్తులకు దర్శనం అనుగ్రహించెను .కొందరు తమకు మంత్రోపదేశము చేసిన గురువుల రూపములో 
కూడా సాయినాథుని దర్శించుకుని తరించిరి .
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లే ,సాయి 
పరమాత్మ తనను ఎవరు ఏవిధముగా సమీపించినవారిని ఆ విధముగానే అలరించెనని 
స్పష్టమగుచున్నది .షిర్డీ యందు ఖండోబా మందిరం ,మారుతి ఆలయము ,శివుని ఆలయము ,గణపతి ఆలయము కలవు .బాబా 
ఈ ఆలయములలో తోడి సాధుపుంగవులతోడి 
సంభాషించుచుండెడివారు .షిరిడీలో శిధిలావస్థలో ఉండే ఆలయములను పునరుద్ధరించెను .ఖండోబా అనగా శివుఁడు .ఈ 
ఆలయములోని పూజారి మహల్సాపతి .బాబా 
మొదట ఈ ఆలయములో వుండవలెను అనుకోగా ,మహల్సాపతి ఆయనను మహ్మదీయుడు అన్న అభిప్రాయముతో మశీదులో ఉండవలిసినదిగా కోరియున్నాడు .
ఇదంతా భగవంతుని సంకల్పమునకు అనుకూల మైన వుహ్యము మాత్రమే .మహల్సాపతి బాబాకు సన్నిహిత భక్తుడయ్యెను .ఆయనయే 
" సాయబాబా " అని నామకరణము చేసెను .
బాబా షిరిడీలో సమస్యగా పరిణమించిన హిందూ 
మహమ్మదీయ వైరమును తొలగించి సామరస్యం 
ఏర్పాటు చేయ దలిచేను .
 ఆయన అవతార కార్యక్రమమే అది .అందువలనే 
ఆయనకు మశీదు స్థావరమయ్యెను .మారుతి 
ఆలయము మసీదుకు చావడికి మధ్యగల సందునందు ఎదురుగా ఉన్నది .మారుతియే 
షిర్డీ క్షేత్రపాలకుడు .మద్రాసు భజన సమాజపు 
యజమాని భార్యకు శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చిరి .సపత్నేకర్ కు ,బలరాం ధురంధర్ 
కు పాండురంగనిగా కనిపించిరి .రఘువీర్ పురంధరేకు ,ఆయన తల్లికి రుక్మాసహిత 
పాండురంగనిగా దర్శనం అనుగ్రహించిరి .నానా 
సాబ్ చందోర్కర్ బంధువుకు దత్త రూపములో 
దర్శనమిచ్చిరి .అట్లే బలవంత్ ఖోజాకర్ కు 
దత్తజయంతి నాడు సాక్షాత్కరించిరి .చిదంబర 
గాడ్గిల్ అనువానికి ,బి .వి .దేవ్ సహోదరునికి 
గణపతి రూపమున కనిపించిరి .సోమనాధ్ నిమోన్కర్ కు మారుతి రూపమున కనిపించి 
మహాభాగ్యం కలిగించిరి .రాధాకృష్ణ మాయికి 
కృష్ణునిని రూపంలో కటాక్షించిరి .బాబా తన ఫొటొ 
రూపమునకుడా భక్తులను ఆనుగ్రహించిరి .
తనకు తన ఫొటోకు భేదం లేదనీ అనేక సందర్భాలలో ఋజువు చేసిరి .అట్లే దేవాలయ 
ప్రతిష్ట పొందిన దేవీదేవతలు సైతము ,
సాయినాథుని దర్శింపుమని తమ భక్తులకు స్వప్నములో ఆదేశించిరి .ఎం .బి .రేగే కు తన ఇష్టదైవమైన మహావిష్ణువు కనిపించి సాయబాబా వద్దకి అతనిని పంపెను .సప్త శృంగిదేవి తన 
పూజారి అయిన కాకాజీ వైద్యను బాబా వద్దకి 
పంపెను .దీనిని బట్టి బాబా సర్వదేవతా స్వరూపుడని తెలియచున్నది .ఆ విధముగా 
ఈ నామము సార్ధకమగుచున్నది .

No comments:

Post a Comment