Sunday, December 6, 2020

ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు లో మెహెర్ బాబా వారి అనుజ్ఞ తో నిర్మించబడిన మెహెర్ స్థాన్ :

ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు లో మెహెర్ బాబా వారి అనుజ్ఞ తో నిర్మించబడిన మెహెర్ స్థాన్ :

1963వ సం.ము ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 7.32 ని.లకు కొవ్వూరు లో శ్రీ కోడూరి కృష్ణారావు గారి వ్యయ ప్రయాసలతో మెహెర్ స్థాన్ నిర్మించబడి అందులో బాబా పంచలోహ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం వైభవముగా జరిగినది. అదే సమయంనకు బాబా మెహెరాజాద్ హాలులో  నిలబడి చప్పట్లు కొట్టగానే "పర్వర్ధిగార్" అని గట్టిగా అందరూ ఉచ్చరించారు. బరోడా మహారాణి శాంతాదేవి చేత విగ్రహ ఆవిష్కరణ చేయబడినది. బాబా పంపిన ఒక ప్రత్యేక సందేశం - నా యందు గల ప్రేమ చేత మీరు ధన్యులు. మెహెర్ స్థాన్ ప్రారంభ ఉత్సవములో పాల్గొన్న ప్రేమికుల ప్రేమ చేత నా సాన్నిధ్యంతో మెహెర్ స్థాన్ నింపివెయ్యబడినది. నా ప్రేమికులు ఉన్న చోటనే నేను ఉంటాను. నాకు స్వాగతం చెప్పడానికి కొవ్వూరు వచ్చిన ప్రేమికులు అందరికీ నా ఆశీస్సులు.

మెహెర్ స్థాన్ కి ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడ ఉన్నది విగ్రహం కాదు. స్వయముగా ప్రియతమ మెహెర్ ప్రభువే ఉన్నారు. బాబాను చూడటానికి ఎవరు వస్తారో, వారికి అక్కడ ఇప్పుడు కూడా బాబా దర్శనము కలుగుతుంది. వారి వారి హృదయములలోని భావనకు అనుగుణముగా దర్శనము కలుగుతుంది. 1954 లో ఆంధ్రా పర్యటనలో బాబా పాదం పెట్టిన స్థలం🌹🙏

No comments:

Post a Comment