షిర్దికర్ చేసిన అన్నదానం .
షిర్డీ లో గల సాయిసంస్థాన్ కొన్ని కారణాలవల్ల
అహ్మద్ నగర్ జిల్లా కోర్ట్ నిర్వహణలో ,కొన్నాళ్లు
ఉండేది .సమాధి మందిరం లో జరుగు నిత్యపూజలు ,అభిషేకాలు ,అన్నదానం ,ఏటా
గురుపౌర్ణిమ ,మహా సమాధి ఉత్చావాలు మున్నగు విశేష కార్యక్రమాలు ,కోర్టు వారిచే నియమింపబడిన ,పాఠక్ అనే కోర్టు రిసీవర్ అధర్వములో నిర్వహింపబడేవి .కోర్టు ఉత్తరువులు ప్రకారం, దినమూ సంస్థాన్ వారికి
లభించే విరాళములు ,హుండీలో గల డబ్బును
రెండవ రోజు ఉదయము ప్రభుత్వ ఖజానాలో
జమ చేయబడేది .ఇది ఇలాఉండగా ఒక రోజు
మధ్యాన్నం కోర్టు రిసీవర్ అయిన పాఠక్ గారికి
షుమారు 600 మంది సాయిభక్తులు దూర ప్రాంతములనుండి వస్తున్నారని ,వారికి రాత్రికి
కావలిసిన భోజన ఎర్పాట్లు చేయాలనీ ఒక సందేశం వచ్చింది .సంస్థాన్ సంబంధించిన డబ్బు
ప్రభుత్వ ఖజనాలో జమ చేయబడి
ఉండుటవలన ,రాత్రికి ఆ 600 మంది భక్తుల
భోజన ఎర్పాట్లు చేయుటకు కావలిసిన 1200
రూపాయలు తన వద్ద లేనందున పాఠక్ గారికి
ఒక పెద్ద సమస్య ఏర్పడింది .ఆలా ఆయన చింతిస్తుండగా ,ఇద్దరు గ్రామస్తులు తాము పక్క గ్రామాలనుండి వచ్చామని ,తాము అన్నదానము
నిమిత్తం 600 రూపాయలు విరాళంగా ఇవ్వదలిచామని చెప్పగా ,పాఠక్ సంతోషించాడు
వారు తమ విరాళములు తొందరగా స్వీకరించమని ,తాము ఇచ్చిన ధనమును రాత్రి
అన్నదానమునకు వినియోగించమని చెప్పారు .
అందుకు మీరు ఇచ్చిన విరాళములనకు ఇవ్వవలిసిన రసీదులు ఎవరి పేరున వ్రాయాలని
పాఠక్ అడిగాడు .
అందుకు అందులొ గల ఒక పెద్దాయన "షిర్డీకర్ "
అను పేరున రసీదు వ్రాయండి ." అని చెప్పి రశీదు
తీసుకుని వెళ్లిపోయారు ." షిర్డీకర్ అంటే షిరిడీలో
నివశించే వ్యక్తి అని అర్థం .పాఠక్ ఆ ధనాన్ని
రాత్రి అన్నదానానికి వినియోగించి ,వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ జరిపారు .కొన్నిరోజుల తరువాత డాక్టరు గాల్వాన్కర్ అని సాయిభక్తుడు
షిర్డి వచ్చి పాఠక్ గారిని కలసి తనకు మూడు రొజుల ముందు ఒక స్వప్నం వచ్చినదని ,
ఆ స్వప్నములో సాయబాబా ,అబ్దుల్ బాబా ఇద్దరు కలసి వచ్చి కొంత ధనము మీకు ఇచ్చినట్లు
కనబడినది .ఆ రోజున మీకు డబ్బు అవసరం
ఏర్పడినదా ? అని అడగగానే పాఠక్ అది విని ఆశ్చర్యపోయాడు .బాబా ఎవ్వరినీ ఆకలితో
ఉంచడం అన్నది లేదని ఈ లీల ద్వారా తెలిసింది .

No comments:
Post a Comment