దత్త లీలా క్షేత్ర మహత్యం
దత్తాత్రేయ షోడశ అవతారాలు
2 వ అవతారం
అత్రివరదుడు
శ్రీ వాసుదేవనంద సరస్వతి. స్వామి విరచిత
తెలుగు :రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.
ముందు అవతార మైన యోగిరాజు దర్శనం కలగాలని, అత్రి మహర్షి కోరిక.
బ్రహ్మ సప్త ఋషులను సృష్టించిన తరువాత అత్రి మహర్షిని గృహస్థాశ్రమం స్వీకరించి,సృష్టిని వృద్ధి చేయమని అజ్ఞ పించారు.తండ్రి మాట కొరకు అత్రి మహర్షి అనసూయ ని వివాహం చేసుకొని అనసూయ మాత తో కూడా ఒంటి కాలు పై రూక్ష పర్వతం పై ఉండి వందల సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేశారు.అప్పుడు అత్రి మహర్షి తల లోనించి యోగాగ్ని వెలువడి,లోకాలను అగ్నితో కాలిపోతోంది.
అప్పుడు త్రిమూర్తులు దర్శనం ఇవ్వగా నేను యోగిరాజు కోసం తపస్సు చేస్తున్నాను.మీరు దర్శనం ఇచ్చారేమి? అన్నారు.త్రిమూర్తులు మేము 3 ఒక్కరే,సృష్టి కార్యం కోసం త్రిగుణాత్మకమై 3 రూపాలుగా కనపడుతున్నాము.అని వారు యోగిరాజు రూపం అయిన శుద్ధ స్పటిక రూపం తో 6 భుజాల తో దర్శనం ఇచ్చారు.తాను అత్రి మహర్షి కి వరదుడు అయ్యాడు కాబట్టి అత్రి వరదుడు అయ్యాడు.
అత్రి వరదుడు వర్ణన;
6 చేతులలో కుడి వైపు 3 చేతుల్లో జపమాల(ఈ జపమాల 52 బీజాక్షరాలతో కూడి ఉంటుంది),2 వ చేతిలో డమరుకం(శాస్త్రo, శృతి,వేదలుకు సంకేతం),3 చేతి లో చక్రం సంసార బంధం విచ్ఛిన్నం చేసి,జ్ఞాన తేజస్సును ఇచ్చి మోక్షం కలిగించడానికి)
ఎడమ వైపు 3 చేతులలో
కలశం-కర్మ సూత్రాన్ని బట్టి కర్మ ఫలాన్ని (ఆహార-నీరు)ఇవ్వడం
త్రిశులం-3 కోనలు-ఆచార, వ్యవహార,ప్రాయశ్చిత్తము, ధర్మం, అర్ధం,కామం,లని
శంఖం-ధ్వని,అపూర్వ,మొదలగు వాటితో యజ్ఞ ద్వారా సృష్టి క్రమం గురించి తెలియజేస్తుంది.
మాలా కమండలు ధర కరపద్మ యుగ్మే!
మధ్యస్థ పాణి యుగళే డమరూ త్రిశూలే !
యస్యస్త ఊర్ధ్వ కరయో: శుభ శంఖచక్రే!
ధ్యాయేత్త మత్రి వరదం భుజషట్క యుక్తం!!
జననం:కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రం గురువారం రోజు జన్మించారు.
కుడి చేతిలో 52 పూసల బీజాక్షర జపమాల,మాలా, డమరుకం, చేతిలో పద్మము,చక్రం, జల కలశం, త్రిశులం,శంఖం, చేతుల్లో కలిగి ఉంటారు.
స్వామి కి నైవేద్యం గా అరటిపండ్లు పెట్టి పై శ్లోకం చదవాలి.
జై గురు దత్త

No comments:
Post a Comment