Sunday, December 6, 2020

సద్గురు అన్వేషణలో శ్రీ బి .వి .నరసింహస్వామి గారు పర్యటిస్తున్నారు

 సద్గురు అన్వేషణలో శ్రీ బి .వి .నరసింహస్వామి 

గారు పర్యటిస్తున్నారు .ఆ పర్యటనలో భాగంగా 

పండరిపురం చేరుకున్నారు .అక్కడివారు బాపుమాయిని దర్శనం చెసుకోమన్నారు .


బాపుమాయి ఒక విశిష్ట యోగిని .శరీరంపై ఒక తుండుగుడ్డను మాత్రమే ధరించేదీ .భక్తులను ఒక పైసా భిక్ష ఇమ్మని అడిగేది .తరువాత అక్కడగల 

చంద్రభాగానది వద్దకి వెళ్లి " అమ్మా ! చంద్రభాగా !

ఈ డబ్బునంతా జగ్రత్తగా దాచు " అని చెప్పి భక్తులిచ్చిన డబ్బులను నదిలో విసిరేది .ఒకరోజు 

శ్రీ బి .వి .నరసింహస్వామి గారు బాపుమాయిని 

పండరిపురంలో చూశారు .అమె వెంట వెళ్ళసాగాడు .అమె అయనను చూసి " ఎవరు నీవు ?అని ప్రశ్నించింది ." నేనొక యాత్రికుడను "

అన్నారు స్వామీజీ ." నాకు ఇల్లు లేదు .నా నివాసం స్మశానం ." అని చెప్పి శ్మశానం వైపు దారితీసింది అమె ."నాకు శ్మశానం అంటే భయం 

లేదు .అక్కడికి పోకూడదని నియమం లేదు " అని 

ఆమె వెనుకనే పోసాగాడు .ఆమె స్మశానానికి చేరింది .స్వామీ వంక చూసి " నీకు ఆకలిగా ఉందా 

అని అడిగింది .నిజంగానే స్వామి ఆకలితో ఉన్నాడు .ఆమెతో " అవును " అన్నాడు .ఇంతలో 

ఒక పెద్ద హోటల్ లో పనిచేసే వ్యక్తి తన దుస్తులలో 

భోజనపదార్దాల ప్లేటుతో వచ్చాడు .ఆ ప్లేటులో 

అన్నం ,రొట్టెలు ,పప్పు ,స్వీట్లు ఉన్నాయి .

బాపుమాయి అయనను భోంచెయ్యమన్నది .

అతను ఆ భొజనం చెసేసాడు .చాలా తృప్తి గలిగింది .ఆ హొటల్ వ్యక్తి ఖాళీ ప్లేటుతో వెళ్లిపోయాడు .అప్పుడు బాపుమాయి "నీకు ఏమి 

కావాలి ?" అని అడిగింది .అందుకు ఆయన "నాకు దేవుడిని చూడాలని ఉంది " అని అన్నాడు 

ఆమె పకపకా నవ్వి " పిచ్చివాడా ! నీవొక మొద్దువు .ఆ పాండురంగడే నీకు భొజనం పట్టుకొచ్చాడు .నర సంచారం లేని ఈ ప్రదేశంలో 

అయన గాక ఇంకెవరు భొజనం తెస్తారు ?అన్నది 

బాపుమాయి .నరసింహస్వామి దిగ్ర్భాంతి చెందాడు ."సర్వానంతర్యామి అయిన సర్వేశ్వరుని దర్శించే అర్హత నీకు ఇంకా రాలేదు .

ఉత్తరదిశలో నీ గురువు నీకోసం ఎదురుచూస్తున్నారు.వెళ్ళి సేవించుకో అన్నారు.


🌻🌹ఓం శ్రీ సాయిరాం ! జై గురుదేవ దత్త 

No comments:

Post a Comment