సాయిబాబా సీమోల్లంఘనం మిషతో భవసాగర సీమోల్లంఘననానికి దసరా యే మంచి ముహూర్తమని సూచించారు " అని రాసారు హేమాడ్ పంత్ సాయిబాబా మహా సమాధి దినాన్ని గూర్చి .ముఖ్యంగా మూడుకారణాలు
ఆ రోజును ఆయన ఎంపిక చేసుకోవడానికి కనిపిస్తాయి .
1 అది దుర్గాపూజ పరిసమాప్తి రోజు .
2 ముసల్మానుల మొహరం నెలలోని
9 వ రోజైన కత్తా ల రాత్రి రోజు .
3 బుద్ధుని బుద్ధ జయంతి .
ఈ మూడు దినాలు 1918 అక్టోబర్ నెల 15 వ తారీఖున కలసి వచ్చాయి .
ఆషూరా అంటే ముస్లిం నెల మొహరం నెలలో
పదివ రోజు .భూమి మీద అల్లా మొదటిసారిగా
వర్షాన్ని కురిపించిన రోజు .తప్పు చేసిన ఆదాము
అల్లాను ప్రార్ధించిన దినము ఈరోజే .
మహమ్మద్ ప్రవక్త అనంతరం ప్రజలు ప్రజాస్వామ్య
రీతిలో ప్రతినిధులను ఎన్నుకోవాలనే ఆకాంక్షతో
మహమ్మద్ మనుమడైన హుస్సేన్ ప్రార్ధనలో
నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై
వెన్నుపోటు పొడిచి సంహరించారు .దీనినే
పీర్ల పండుగగా విషాదంగా జరుపుతారు .

No comments:
Post a Comment