Sunday, December 6, 2020

ఆ పాలరాయి ఖరీదు అప్పటిలో ఇరవైరెండు వేలు రూపాయలు .విగ్రహము చెక్కడానికి దాదాపు రెండు ఏళ్లు పట్టింది .అయిదున్నర అడుగుల ఎత్తున్న ఆ విగ్రహాన్ని 7 -10 -1954 ,గురువారం విజయదశమి నాడు

 ఆ పాలరాయి ఖరీదు అప్పటిలో ఇరవైరెండు వేలు 

రూపాయలు .విగ్రహము చెక్కడానికి దాదాపు రెండు ఏళ్లు పట్టింది .అయిదున్నర అడుగుల ఎత్తున్న ఆ విగ్రహాన్ని     7 -10 -1954 ,గురువారం 


విజయదశమి నాడు ,సాయిభక్తుడైన శ్రీ సాయి శరణానంద చేతులమీదుగా బూటీ వాడా ( సమాధిమందిరం ) లో ప్రతిష్టించారు .                                                                ఆ విగ్రహం 

సాయి సమాధికి వెనుక వైపు పడమటి గోడ మీద 

ఉంది .ఆ విగ్రహము తూర్పు ముఖంగా ఉంది .

సాయబాబా సశరీరులుగా 1854 సం .లో షిరిడీకి 

వచ్చారు .సరిగ్గా 100 సంవత్సరాలకు అంటే 1954 సం .లో ,మహాసమాధి చెందిన 36 ఏళ్లకు 

సమాధి మందిరములో పాలరాతి మూర్తిగా మురళిధరుని స్ధానంలో వేంచేశారు .ఆ పాలరాతి 

మూర్తిని దర్శించుకోడానికి షిరిడీలో భక్తులు ప్రాతకాలమునుండే బారులు తీరివుంటారు .

దర్శించిన ప్రతీ భక్తునికి బాబా తనవైపే చూస్తున్నారని భావన కలుగుతుంది .

ఒక్కొక్కరికి ఒకొక్క దివ్యానుభూతి లభిస్తుంది .

సాయబాబా పాలరాతి విగ్రహాన్ని చెక్కిన బాలాజీ 

వసంత తాలిమ్ అమరుడు .అపార కరుణమూర్తి 

ఆ సుందర సాయినాధుని రూపాన్ని అందరూ దర్శించాలని ,బ్రహ్మానందాన్ని అనుభవించాలని 

కోరుకొందాం .

( షిరిడీలో సమాధి మందిరం లో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగి నేటికి 7 -10 -2019 కు 65 

ఏళ్లు ముగుస్తాయి .)

No comments:

Post a Comment