Sunday, December 6, 2020

శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు ....నర్మదా మాత

 శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు ....నర్మదా మాత 🙏🏻


ఒకసారి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారికి నర్మదా మాత కలలో కనిపించి తనకు దగ్గరలో కొంత కాలం గడపమని ఆదేశించింది. కానీ స్వామి వారు దానిని పట్టించుకోలేదు. చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు స్వామి వారి పాదతీర్థం లభించాలని ఎదురుచూస్తున్నాడు. కానీ స్వామి వారు తమ పాదతీర్థం ఎవరికీ ఇవ్వరు. ఒకసారి స్వామి వారు ఏదో వ్రాసుకుంటుండగా వెనుకనుంచి దొంగచాటుగా వెళ్లిన ఆ బ్రాహ్మణుడు స్వామి వారి పాదము ( ఒక పాదము బయటకు పెట్టి కూర్చున్నారు) మీద నీళ్ళు పోసి, క్రింద ఒక గిన్నె వుంచి దానిలో పట్టుకుని తాగేశాడు. కొంచెం నీటిని వంటికి రాసుకున్నాడు. ఉలిక్కిపడ్డ స్వామి వారు అలా ఎందుకు చేశావ్? అన్నారు. అతడు తన పరిస్థితి వివరించి క్షమించమని వేడుకున్నాడు. స్వామి వారు చాలా విచారపడి వెంటనే గంగా నదిలో స్నానం చేసి గంగా నదిమీద శ్లోకాలు రచించి స్తుతించారు. ఆ బ్రాహ్మణుడి వ్యాధి స్వామికి వచ్చి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి. ఆ రాత్రి దతస్వామి కలలో కనపడి వ్యాధి తగ్గటానికి నర్మదా నదిలో మూడు రోజులు స్నానం చేయమన్నారు. స్వామి వారు నర్మదకు ముఖ్య స్థానమైన నెమావర్ అనే చోటుకు వెళ్లి నర్మదా మాతను ప్రార్థించారు. వ్యాధి తగ్గింది. అక్కడనే నర్మదా లహరి ని రచించారు

No comments:

Post a Comment