Sunday, December 6, 2020

స్కూల్ టీచరుగా పనిచేస్తూన్న కుశాభావ్ అను బ్రాహ్మణుడు


 స్కూల్ టీచరుగా పనిచేస్తూన్న కుశాభావ్ అను బ్రాహ్మణుడు ,అద్భుత శక్తులుగల దత్త మహరాజ్ 

అనే ఒక యోగిపుంగవుని అశ్రయించి ,అయనను పీడించి మారణము ,వశీకరణం మొదలైన క్షుద్ర 

విద్యలు నేర్చుకొన్నాడు .అతని చేతికి ఇనుము ,

రాగి కడియాలుండేవి .అతను ఏది కోరితే అవి 

అనగా పండ్లు ,మిఠాయిలు మెదలైనవి తక్షణమే 

అతని చేతికి వచ్చేవి .కొన్నాళ్లకు అతని గురువైన దత్త మహరాజ్ హిమాలయ పర్వతాలకు తపస్సు 

నిమిత్తం వెళ్ళిపోతూ ,ఇక ముందు షిర్డీలోగల సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి వెళ్లిపోయాడు .కుశాభావ్ 1908 సం.లో షిరిడీకి 

వెళ్ళి బాబాను దర్శించగా బాబా కోపోద్రిక్తులై 

ఆతనిని మశీదులో ప్రవేశించనివ్వలేదు .అతడు గత్యంతరం లేక అక్కడగల ఇతర భక్తులను ,తనపై బాబా కృపచూపునట్లు బాబాను  ప్రార్దించమని కోరాడు .అప్పుడు బాబా వారితో 

"అతడు ఆ క్షుద్ర శక్తులను విడచి ,చేతి కడియాలు 

తీసిపారేస్తే గానీ అతనిని మసీదులోకి రానివ్వను "

అని గట్టిగా చెప్పగానే కుశాభావ్ ఆలాగునే చేసాడు .తరువాత అతనికి సమర్థ రామదాసు 

రచించిన "దాసబోధ "పారాయణ చేయమని 

అజ్ఞాపించారు .కొంతకాలం తరువాత బాబా ఆజ్ఞానుసారం దత్త క్షేత్రమైన "గాణ్గా పూర్ "వెళ్ళి 

దత్త పాదుకలు సేవించి శ్రీ గురుచరిత్ర 108 సార్లు 

పారాయణం చేసాడు .ఒకసారి అతడు ఏకాదశి 

ఉపవాసం వున్నట్లు చెప్పగా ,బాబా ఉపవాసాన్ని 

నిరసిస్తూ ,అతనిచేత ఉల్లిగడ్డలు తినిపించి ,తాను 

కూడా తిన్నారు .

[6:59 AM, 10/10/2020] +91 98497 26896: బాబా అక్కడఉన్నవారితో చమత్కరిస్తూ ,

కుశాభావ్ ఏకాదశినాడు ఉల్లిగడ్డలు తిన్నాడని చెప్పగా అందుకు బాబా ఉల్లి స్వీకరిచినందున 

తాను తిన్నానని చెప్పాడు .సాయబాబా మాత్రం 

తాను ఉల్లిగడ్డలు తినలేదని ,కందమూలములు 

తిన్నాననీ ,తన మాటను ఋజువు చేయడానికి 

నోటిలోంచి కక్కారు .వేంటనే కుశాభావ్ తన గురుదేవుడైన సాయబాబా ఏకాదశి రోజున ప్రసాదం అనుగ్రహించారని అనుకొని బాబా నోటిలోంచి కక్కిన వాటిని తినసాగాడు .బాబా అతనిని తిట్టి ,కొట్టి వారించారుగానీ ,అతడు పూర్తిగా తిని ,ఆయన మాటలను దెబ్బలను 

ప్రసాదంగా స్వీకరించాడు .తక్షణమే బాబా శాంతించి ,అతని భక్తీ విశ్వాసాలకు ఆనంద బాష్పాలు రాలుస్తూ ,అతడిని ఆశీర్వదిస్తూ ఇలా 

అన్నారు " నీవు ఎప్పుడైనా నన్ను ధ్యానించిన 

తక్షణం ,నీ చేతిలోకి ధునినుండి విభూతి రాగలదు 

ఇది నా వరం .దానిని కోరినవారికి ఉచితంగా 

ప్రసాదించు .అది నీకు మేలు చేయగలదు ."

తరువాత అనేక మంది కుశాభావ్ చేయినుండి 

విభూతి గురు కృపంగా వచ్చుట ఆనాడు అనేక 

మంది భక్తులు ప్రత్యక్షంగా చూశారు .

No comments:

Post a Comment