దత్త లీలా క్షేత్ర మహత్యం 🙏🏻
దత్తాత్రేయ షోడశ అవతారాలు
3.::శ్రీ దత్తాత్రేయడు
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.
త్రిమూర్తులు అత్రిమహర్షి తపస్సుకు మెచ్చి నేనే మీకు స్వయంగా దత్తం అవుతాను, మీ తపస్సుకు, అనన్య భక్తికి ప్రసన్నం అయ్యాను. నేనే స్వయంగా మీకు కుమారుడుగా జన్మిస్తాను అని వరమిచ్చిన అత్రి వరదుడు తానే స్వయంగా అత్రికి అర్పణం అయి, అతి దుర్లభం అయిన ఆ పరమాత్మ బాల రూపంలో అత్రి కుమారుడుగా, అత్రి మహర్షికి దత్తమై దత్తాత్రేయడుగా అవతరించారు.
ఈ అవతార సంప్రదాయం ప్రకారం దత్తాత్రేయ నామ ధేయం తో ప్రసిద్ధి చెందారు.
ఈ అవతార జననం:::కార్తీక బహుళ విదియ,మృగశిర నక్షత్రం,శుక్రవారం వేకువఝామున 1 గంటకు జన్మించారు. జ్ఞాననిధి, విశ్వ గురువు దత్తాత్రేయ స్వామి.
ఈ దత్తాత్రేయ రూప వర్ణన:
ఈ అందమైన రూపాన్ని శాండీల్యోపనిషత్తు ఈ విధంగా వివరించింది.
ఇంద్రనీల రత్నం రంగులో మెరుపు వంటి శరీరం కలిగి, ముఖం చంద్ర బింబంతో మంచి సువాసనలతో కూడి, చతుర్ భుజాలతో అవతరించిన త్రి మూర్తి స్వరూప విష్ణువై, శంఖు, చక్రం, పద్మం, గద కలిగి ఉండే దివ్య మంగళ స్వరూపం.
ధ్యానం చేసే వారికి స్వామి ఎక్కువగా ఈ రూపంలో దర్శనం ఇచ్చి ఆశీర్వదిస్తారు. శరీరం అంతా భస్మం ధరించి తలపై జటా జూటాలు ధరించి, వికసించిన పద్మముల వంటి అత్యంత సుందరం మైన కళ్ళు కలిగి ఉంటారు.
యోగిజన ప్రియుడు, విశ్వ గురువు, భగవాన్ దత్తాత్రేయ జ్ఞానయోగి అయి, విశ్వమునకు సర్వసాక్షి అయి, భక్త వత్సలుడుగా, కేవలం భక్తి కలిగిన భక్త జనులకు సులభుడు గా,
దయసింధుగా ఉంటారు.
దత్తాత్రేయం శివం శాంతమింద్రనీల నిభం ప్రభుమ్!
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ॥ భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూట ధర విభుమ్ ॥
చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్!!
స్వామికి చెరకు రసం నైవేద్యంగా పెట్టి శ్లోకం చదవాలి.
జై గురుదేవ దత్త.🙏🏻

No comments:
Post a Comment