షిర్డి సాయిబాబాను బహుజన హితాయ బహుజన సుఖాయ గా కీర్తిస్తారు .బాబాకు ప్రియ భక్తుడు ,నానాసాబ్ డేంగ్లే .ఆయన షిరిడీకి సమీప గ్రామమైన నీంగామ్ వాస్తవ్యుడు .బాబా తరచూ
నీంగామ్ వెళ్లి డేంగ్లే కుటుంబాన్ని ఆశీర్వదిస్తుండేవారు .ఒకసారి సాయబాబా నీమగాం వెళ్లి ,డేంగ్లే గృహములో గల పెరటిలో
డేంగ్లేతో మాట్లాడుతున్నారు .పెరటిలో గల ఒక చెట్టు పై రెండు పక్షులు మాట్లాడుకోవడం డేంగ్లే
విన్నాడు .డేంగ్లేకు పక్షుల భాష తెలుసు .బాబా కు
డేంగ్లేకు పక్షుల భాష తెలుసునని విన్నాడు .బాబా
డేంగ్లేతో " ఆ పక్షులు ఏమి మాట్లాడుకొన్నాయని
అడిగారు .ఆ రోజు షిర్డీలోని శని దేవాలయములో
శని దేవునికి సమర్పిస్తున్న ప్రసాదంలో ,ఒక విషసర్పం పడి చచ్చినదని ,ఆ విషపూరితమైన
ప్రసాదం తిని తొమ్మిదిమంది చనిపోతారని ఆ పక్షులు మాట్లాడుకొన్నాయని డేంగ్లే బాబాకు
చెప్పాడు .అదివిన్న సాయినాధుడు వెంటనే ఒక
తాంగా ( tongaa ) కట్టించుకుని షిర్డీ చేరారు .
ద్వారకామాయిలో ,శనిదేవునికి సమర్పించిన ప్రసాదం ,అక్కడగల భక్తులకు ప్రసాదంగా ఇవ్వడానికి సిద్దంగా ఉండటం చూసి ,దానిని
భాగోజీ శిందే అనే భక్తునితో నేలపాలు చేయించారు .విషయము తెలియని అక్కడివారు
భాగోజీ శిందే ను కొట్టబోయారు .అతడు వెళ్లి సాయిబాబాను శరణు వేడాడు .సాయిబాబా అక్కడి భక్తుల ను వారించి నేలపాలైన ఆ ప్రసాదంలో చచ్చిపడి ఉన్న ఆ విషసర్పాన్ని చూపించారు .అప్పుడు అక్కడ గల భక్తులు ,
బాబా తమ ప్రాణాలు కాపాడినందుకు కీర్తించారు
వారి ప్రాణాలు కాపాడినది తానుకాదని ,
నీమగాం లో గల డేంగ్లే అని వారి కి చెప్పారు .
ఆ విషపూరిత ప్రసాదాన్ని దూరముగా తీసికొనిపోయి ఒక గుంటలో పాతిపెట్టారు .
" అహంభావహీనం ప్రసన్నాత్మాభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం "
భగవంతుడు భక్తుల ను స్వయంగా రక్షించినా,
ఆ రక్షణ మరొక ప్రియభక్తుని ద్వారా జరిగినట్లు
తెలుపుటయే సాయినాథుని ప్రేమతత�

No comments:
Post a Comment