దత్త లీలా క్షేత్ర మహత్యం....
దత్తాత్రేయ షోడశ అవతారాలు ...
5:: యోగిజన వల్లభుడు
దత్తాత్రేయ ప్రభువు 5 వ అవతారం ఇది.
శ్రీ వాసుదేవనంద సరస్వతి. స్వామి విరచిత.
తెలుగు అనువాదం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.
దత్తాత్రేయ స్వామి అత్రిమహర్షి యొక్క యోగాగ్నిని చల్లార్చి, అనాది సిద్ధ ప్రభు, పురుషోత్తముడు, పరమాత్మ, భగవాన్ శ్రీ దత్తాత్రేయస్వామి బాలుని రూపంలో అనసూయ సన్నిధిలో విరాజిల్లుతూ, అత్రి ఆశ్రమంలో అవతరించారని తెలుసుకొని, యోగ జనులు అయిన ఇంద్రాది దేవతలు, గంధర్వులు, మునులు,సత్పురుషులు,యోగులు,సాధువులు, ప్రజలు అందరూ దర్శనానికి వచ్చారు. అప్పుడు బాలుని రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి తన తేజోమయ రూపంలో దర్శనం ఇచ్చి, యోగబోధను, మధుర కంఠంతో ఈవిధంగా చేశారు. నాకు జన్మ,కర్మ,గుణ,ఆకారం,కాలము,మాయ,మృత్యువు, గుణం,నాశనము ఏమి లేవు. సర్వవ్యాపిని. ఈ మూర్తి స్వరూపమును మీరు ధ్యానించండి. అని జనులకు యోగం ఉపదేశించారు కాబట్టి స్వామిని అందరూ యోగిజన వల్లభుడు అని పిలిచారు.
మార్గశీర్షం శుద్ధ పౌర్ణమి రోజు గురువారం మధ్యాహ్నం అవతరించారు. కాబట్టి మార్గశీర్షంలో స్వామి రెండు అవతారాలు వచ్చాయి.
జై గురు దత్త.
శ్లో॥ యోగ విజ్ఞాన నాథాయ భక్తానంద కరాయచ!
దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమ:
జననం:మార్గశిర పూర్ణిమ, గురువారం మధ్యాహ్నం.
నైవేద్యం:పంచభక్ష్యాలు.సమర్పించి పై శ్లోకం చదవాలి

No comments:
Post a Comment