మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిగెల్ రాయి తాలూకాలో పాంచలేశ్వర్ గ్రామమున్నది .అక్కడే
గోదావరి నది ఉన్నది .ఆ నది మధ్యలో దత్తాత్రేయ
ప్రభువు భోజనం చేసే గద్దె కలదు .(8 ×4 ×2 )
గద్దె పరిమాణం .చుట్టూ భక్తులు కూర్చొని ధ్యానం
జపము ,చేసుకోవడానికి బండలు ఏర్పాటు చేశారు .ఆ గద్దె పై భాగములో ఎనిమిది పిల్లర్స్
తో అష్టభుజి ఆకారములో రూఫ్ వేసిఉంటుంది .
అక్కడ దత్తాత్రేయ విగ్రహము ఏమీ ఉండదు .
గోదావరి నీటి ప్రవాహము పెరిగితే ఈ గద్దె మునిగిపోతుంది .ప్రతిరోజూ అక్కడగల పూజారి
పాంచలేశ్వర్ గ్రామానికి భిక్షకు వెళతాడు .
అక్కడ గ్రామస్తులు ఇచ్చిన రొట్టె ,అన్నము ,
కూరలు ,స్వీట్లు తీసుకొచ్చి 12 గంటల కల్లా నివేదన చేసి ,అక్కడ కూడిన భక్తులకు భోజనం
పెడతారు .భక్తులు కొందరు ధ్యానం ,మరి కొందరు
గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేసారు .ఈవిధంగా పాంచాలేశ్వర్ నందు నిత్య కార్యక్రమం జరుగుతుంది .
'కాశి స్నాన జప ,ప్రతిదివాసి
కోల్హాపూర్ భిక్షేసి ,నిర్మల నది తుంగ
జలప్రాసి ,నిద్రా మాహుర్ దేశి .
ప్రతిరోజూ దత్తాత్రేయ స్వామి వారణాసిలో స్నానం చేసి ,కొల్హాపురి నందు భిక్ష చేసి ,
పాంచాలేశ్వర్ నందు మధ్యాన్న భోజనం చేసి
మహూర్ ఘడ్ నందు నిద్రిస్తారు .
( సాయిదర్శన్ పూర్వపు సంచికల నుండి సేకరణ ).

No comments:
Post a Comment