Sunday, December 6, 2020

శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారి జీవిత చరిత్ర నుంచి, శ్రీ స్వామి సమర్థ (అక్కల్కోట మహారాజ్),శ్రీ గజానన్ మహరాజ్ (షేగావ్), శ్రీ షిరిడీ సాయిబాబా గురించి వున్న కొన్ని సంఘటనలు.....

 శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారి జీవిత చరిత్ర నుంచి, శ్రీ స్వామి సమర్థ (అక్కల్కోట మహారాజ్),శ్రీ గజానన్ మహరాజ్ (షేగావ్), శ్రీ షిరిడీ సాయిబాబా గురించి వున్న కొన్ని సంఘటనలు.....


శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు వాడీ నుంచి  పండరి పురం వెళ్తూ దారిలో కమలాపూర్ అనే చోట వుండగా ఒక పొడవాటి, ఆజానుబాహుడు కలలో కనిపించి, " నీవు అన్నిచోట్లకి వెళ్తున్నావు. ఎంతో కవిత్వం వ్రాస్తున్నావు. కానీ నా గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు?", అని అడిగారు. తరువాత ఈ కనిపించిన మహాత్ముడు ఎవరని దత్త స్వామి ని అడిగారు. అప్పుడు స్వామి వారు శ్రీ అక్కల్కోట మహారాజ్. వారిని దర్శించి వారి యొక్క జీవిత చరిత్రని కవిత్వాల ద్వారా చెప్పమని వారి కోరిక, అని చెప్పారు. దత్త స్వామి చెప్పిన విధంగా స్వామి సమర్థను అక్కల్కోట లో దర్శించుకున్నారు. 

🌸🌸🌸🌸🌸

శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు విదర్భ మీదుగా వెళ్తూ షేగావ్ వచ్చారు. ముందు రోజు గజానన్ మహరాజ్ గారు వారి శిష్యులతో ఈ విధంగా చెప్పారు, " నా సోదరుడు, జ్ఞాని, కర్హాడా బ్రాహ్మణుడు నన్ను చూడటానికి వస్తున్నారు. వారు పరమ నిష్ఠా గరిష్టులు. వారు వచ్చే దారిలో గుడ్డముక్కలు లాంటివి లేకుండా శుభ్రంగా ఉంచండి, " అన్నారు. వారు వచ్చే సమయానికి గజానన్ మహరాజ్ గారు వేళ్ళు విరుచుకుంటూ అన్యమనస్కంగా వున్నారు. వాసుదేవానంద సరస్వతీ స్వామి వారిని చూడంగానే ఉన్నట్టుండి వేళ్ళు విరవడం ఆపివేసి వారు చిరునవ్వుతో, ఆనందం తో కూడిన ముఖములతో ఒకరనొకరు చూసుకున్నారు. వారి ఇద్దరి మధ్య సంభాషణ ఏమి జరగలేదు. ఒకరి సమక్షంలో ఒకరు ఆనందంగా గడిపారు. కొంచెం సేపటికి స్వామి వారు వెళ్లడానికి లేవగా, గజానన్ మహరాజ్ గారు " మంచిది ",అని మాత్రం అన్నారు. 

🌸🌸🌸🌸

వీరు షిరిడీ సాయి బాబా కి సమకాలికులు. షిరిడీ సాయి బాబా వారు కూడా నిత్యము ధుని వెలిగించి అగ్నిని ఆరాధించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు కూడా అగ్ని ని ఆరాధిస్తూ, మత సంబందమైన పూజాదికాలను ఖచ్చితంగా పాటించేవారు. వీరిద్దరు అన్నదమ్ముల వలె ఒకరినొకరు గౌరవించు కుండేవారు. వీరు ఒకసారి రాజమహేంద్రవరంలో వుండగా, నాందేడ్ నుంచి పుండలీకరావ్ అనే లాయర్ తన స్నేహితులతో కలిసి దర్శనం చేసుకున్నారు. పుండలీకరావ్ సాయిబాబా భక్తుడు. వారి సంభాషణల మధ్య బాబా వారి పేరు రాగా, ఆ పేరు వినటంతోనే స్వామి వారు భక్తిభావనతో పొంగిపోయి చేతులు జోడించి, మీరు షిరిడీ ఎప్పుడు వెళ్తున్నారు?అని అడిగారు. ఇక్కడ నుంచి షిరిడీకే వెళ్తున్నాము అని చెప్పారు. అప్పుడు స్వామి వారు  ఒక కొబ్బరి కాయ తీసుకుని హృదయము నకు దగ్గరగా వుంచుకని,పుండలీకరావ్ కు ఇచ్చి, దీనిని నా సోదరునకు అందచెయ్యమన్నారు. వెంటనే షిరిడీకి  బయలుదేరి వెళ్ళారు, పుండలీకరావ్ అతని స్నేహితులు.

No comments:

Post a Comment