Tuesday, May 14, 2024

సాయి సచ్ఛరిత్రలో 17 వ యధ్యాయము బ్రహ్మ జ్ఞాన వివరణ కనిపిస్తుంది

 *సాయి సచ్ఛరిత్రలో 17 వ యధ్యాయము బ్రహ్మ జ్ఞాన వివరణ కనిపిస్తుంది*.


*బ్రహ్మజ్ఞానమనగా ఈ సకల సృష్టి దేనియందు పుట్టి, పెరిగి, లయమవుతుందో ఆ సద్వస్తువే " బ్రహ్మము ".* 

*ఇది నిత్యసత్యమైనది. స్వయం ప్రకాశమైనది.*

*ఆ సద్వస్తువే అనగా భగవంతుడు లేదా బ్రహ్మము మానవ దేహంలో " ఆత్మ స్వరూపంగా " ప్రతిష్ఠితమై ఉన్నాడు.*

*ఆ పరబ్రహ్మమూ, మానవదేహము లోని ఆత్మా ఒకటే అని వేరుకాదనే అను ప్రత్యక్ష అనుభవము కలగడమే " బ్రహ్మ జ్ఞానమంటారు ".*

*బ్రహ్మ జ్ఞానం కలిగిన మానవులకు ఈ జగత్తులోని సమస్తమూ తమవే అవుతాయి.* 


*తాను తప్ప ఈ జగత్తులో రెండో వస్తువు లేదన్న భావన కలుగుతుంది.* *అందువలన ఎటువంటి భీతి వుండదు.* *సర్వమును అరచేతిలోని ఉసిరికాయ వలె అవగతమవుతుంది.* 

*సమస్త దుఃఖాలనుండి చింతల నుండి నివృత్తి కలుగుతుంది.*


*పరమానంద స్ధితి లభ్యమవుతుంది. పునర్జన్మ వుండదు. అందుకే బ్రహ్మజ్ఞానం పొందటం అవసరం.*


*ఈ అధ్యాయములోనే మనసును ఎలా స్వాధీన పరుచుకోవచ్చును ? అన్న విషయము ప్రస్తావించబడినది.*


*మనసు నిరంతరమూ బహిర్ముఖమై, దృశ్య విషయాలతో మమేకమై, బంధంగా పరిణమిస్తుంది.*


*ఏఏ సంకల్పముల వలన, మనసు బహిర్ముఖమై, దృశ్య విషయాలపై పోవుచున్నదో గమనించి, ఆ సంకల్పముల నుండి మనసును మరల్చి అంతర్ముఖం చేయుట ద్వారా మనసును స్వాధీనపరచుకోవచ్చును.*

No comments:

Post a Comment