Tuesday, May 14, 2024

షిరిడీలో సమాధి మందిరం సజీవ కళతో ప్రకాశిస్తున్న సాయి బాబా పాలరాతి విగ్రహాన్ని దర్శించి ఒక విచిత్రమైన అనుభూతితో పొందిన మనసుతో " బాబా స్థితి, ఆయనకు ఈ సృష్టినుంచి అననన్యముగా తోచి వుండదు.*

 *" షిరిడీలో సమాధి మందిరం సజీవ కళతో ప్రకాశిస్తున్న సాయి బాబా పాలరాతి విగ్రహాన్ని దర్శించి ఒక విచిత్రమైన అనుభూతితో పొందిన మనసుతో " బాబా స్థితి, ఆయనకు ఈ సృష్టినుంచి అననన్యముగా తోచి వుండదు.*

*ఆయన తాను శరీర పరిమితుడన్న భావాన్ని విస్మరించి, ఈ చరాచర విశ్వమంతా ఏ మహత్తర చైతన్యములో సంకల్పమాత్రముగా ఉన్నదో, ఆ చైతన్యముతో  బాబా తాదాత్మత చెంది ఉన్నారు.*


*ఇది ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారికి షిరిడీలో బాబా మొదట దర్శనములో కలిగిన అనుభూతి.*


*"ఎవరయితే ఎప్పుడూ నా గురుంచే వింటూ, నా లీలలే చింతన చేస్తూ, నన్నే స్మరిస్తారో, వారి కర్మ నశించి నేనే వారిగా మారిపోతారు " అని సాయిబాబా పలికిన మాటలు.* 

*26 సంవత్త్సరాలు నిరంతర సాయి సేవలో, సాయి స్మరణలో జీవితాన్ని గడపి ధన్యులైనారు."*

 *శ్రీ సాయిమాస్టర్ గా , సాయిబాబా బేటా గా, మహాత్ముల ముద్దు బిడ్డడుగా పేరొందిన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు ." తల్లికి తగ్గ బిడ్డలు కండి, మీ అధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి " అన్న బాబా సూక్తికి ప్రతీకగా బాబా పూర్ణ అనుగ్రహాన్నీ పొంది సాయిభక్తుల మనసులలో స్థిరంగా నిలిచిపోయిన మహానుభావుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు.*


*మరుగుపడిన దత్త స్వరూపాలైన అవధూతలను మహాత్ములను, యోగులను భక్తులందరికీ అవగాహన కల్పించిన మహనీయుడు మన మాస్టరుగారు, ఉన్నత పదవులు, కీర్తి కాంక్షలు ఆశించక, సాయి శరణాగతి తత్వములో 51 సం .లు జీవించి, 1989 ఏప్రియల్ 12వ తేదీ నాడు ఆ సమర్ధ సద్గురు, కైవల్య ప్రదాత అయిన శ్రీ షిర్డి సాయినాధునిలో ఐక్యమయ్యారు.*

*నేడు ఆయన 35 వ ఆరాధన దినోత్సవం,  సాయి మాష్టరుకి ఇవే మా హృదయపూర్వక నమస్సులు.*

No comments:

Post a Comment