Wednesday, May 15, 2024

షిరిడీలో సాయిబాబా సన్నిధిలో దాదాపు మూడు నెలలు ఉండిన ఏకైక తెలుగు వ్యక్తి శుద్ధానంద. ఆయన కవి, యోగి, మహార్షి.*

 *షిరిడీలో సాయిబాబా సన్నిధిలో దాదాపు మూడు నెలలు ఉండిన ఏకైక తెలుగు వ్యక్తి శుద్ధానంద. ఆయన కవి, యోగి, మహార్షి.*


*కవి యోగి మహర్షి డా. శుద్ధానంద భారతి (11 మే 1897 - 7 మార్చి 1990) ఒక భారతీయ తత్వవేత్త మరియు కవి. అతని బోధనలు అతను సృష్టించిన సామ యోగ అభ్యాసం ద్వారా స్వయం లో భగవంతుని అన్వేషణపై ప్రధానంగా దృష్టి సారించాయి.*


*అలనాటి భారతదేశంలో చాలమంది సమకాలిక మహానీయులను దర్శించి, వారితో అనుబంధం ఏర్పరుచుకున్న ఏకైక వ్యక్తి ఈయనే అనవచ్చు.*


*ఆయన 1897 సం. లో జన్మించారు.* 


*సాయిబాబా గూర్చి అనేక విషయాలను తెలిపారాయన,* 

*సాయిబాబా "రాం రాం అల్లారామ్ " అని తనకు భిక్షనిచ్చేవారిని దీవించేవారు.*


*సాయిబాబా కోసం భక్తులు వెండి పల్లకిని ఇచ్చారు.*

*బాబా ఆ పల్లకిలో వీథిలో నున్న ఒక కుక్కను నిద్రపోనిచ్చేవారు. కుక్కలో కూడా దైవం ఉన్నారు అనేవారు బాబా.*

*సాయిబాబా తాను తెచ్చుకున్న భిక్షను కుక్క మున్నగు ప్రాణులకు మొదట పెట్టి మిగిలినదానిని పేదసాదలకు పంచేవారు.*

*ఆయన అతి తక్కువగా తినేవారు.*


*శుద్ధానంద భారతి సాయిని కీర్తించేటప్పుడు "కీర్తి చెంద వలిసింది భగవంతుడు ఒక్కడే.*

*ఆయనే మన గురువు. ఆయనదే ఈ సృష్టి. జరిగేది అంతా ఆయన లీల.*


*సూర్యుడు, చంద్రుడు, తారకలు, నీలాకాశం అంతా ఆయన సృష్టే.*

 *సృష్టి అంతా ఆయన చమత్కార లీల కాదా ! సూర్యోదయాన్ని మించి చూపే చమత్కార లీల వేరే ఉంటుందా .?* 

*చమత్కార లీలలన్నీ ఆయనవే. ఆయనే విశ్వంభరుడు. ఆయన యందు ఎనలేని నమ్మకాన్ని వుంచుకో " అని అనేవారు.*

*ఇంకా బాబా శుద్ధానందతో "నోరు మూసుకొని ఉంచు. హృదయం తెరుచుకో. బయపడకు. నీవు ఎలాంటి తుఫాన్ నైనా ఎదుర్కొనగలవు.*

*ఈ శరీరం త్వరలో నశించవచ్చు. నేను శరీరం కాదు.*

*సాధకులకు సాయం చేసేందుకు నేను అని చోట్లా ఉంటాను " అనేవారు.*


*శుద్ధానందభారతి షిరిడీలో ఉన్న కాలంలో ఒక ముస్లిం మతస్తుడు, సాయిబాబా రామాయణాన్ని, రామనామాన్ని ప్రోత్సహిస్తున్నాడని సాయిబాబాను వధించడానికి కత్తి తీశాడు.* 

*సాయిబాబా లేచి నిలబడ్డారు.*

*ఆ ముస్లింతో "ఆలాగే కానివ్వు, చంపు. పైన నీవు చేసే పని అల్లా చూస్తున్నాడు " అని అన్నారు.*


*ఆ మాట విన్న ఆ వ్యక్తి నిర్ఘాంతపోయాడు.*

*కత్తి నేలమీద పడింది.*

*అతడు నేలపై కుప్పకూలాడు, కదలలేకపోయాడు.*


*"అల్లా ...హే అల్లా ..మాఫ్ కరో ..."అని అర్ధించాడు.*


*"ఈ భూమి మీద అన్ని శరీరాలు బూడిద అవవలిసిందే.

*అలా జరిగేముందు వినయంగా, నిరాడంబరంగా, నమ్మకం కలిగి ఉండు.*

*అల్లా తనకు ఇష్టం వచ్చినట్లు మలచుకొంటాడు' అని అన్నారు సాయి.*

   

*అల్లా అచ్చా కరేగా ....*

No comments:

Post a Comment