Sunday, December 6, 2020

ఓం శ్రీ సర్వమత సమ్మతాయనమః . అన్ని మతములను అంగీకరించినవాడు శ్రీ సాయబాబా

 శ్రీరామ నవమి ఉత్సవమును ,చందన ఉత్శవమును ,ఒకేదినమున హిందూ మహమ్మదీయుల సామరస్యమునకు సహకరించింది .వివిధ దేవీ దేవ రూపములలో 


తాను భక్తులకు సాక్షాత్కారము కలిగించుట ,

ఆంతరంగిక భేదములు అంతరించుటకు కారణమైనది .సహపంక్తి భోజనములు మత భేదములు విస్మరింప చేసినవి .అన్నింటిని మించి 

ఆయన ప్రేమ ప్రవాహము వివిధ మతస్తులకు 

పవిత్ర భావమును కలిగించి సామరస్యమును 

నెలకొల్పెను  .కావుననే ఆయన సర్వమతస్తుడు .

శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి .

ఓం శ్రీ సర్వమత సమ్మతాయనమః .

అన్ని మతములను అంగీకరించినవాడు శ్రీ సాయబాబా .అందువలన అభేదానందం కలిగించెడివాడు .సర్వసృష్టిని చేసిన భగవంతుడే 

సర్వమతములను ( విశ్వాసములు ) కల్పించెను 

అందువలన బాబాకు సర్వమతములు సమానుములే .ఆ రోజులలో ముఖ్యముగా హిందూ మతములకు సమర స్వభావమే కానీ 

సామరస్య స్వభావం లేదు .అట్లే అద్వైత ,విశిష్ట అద్వైత ,శాక్తేయ ,గణపత్యాది భేదములు హిందువులలోనే గలవు .షియా ,సున్నీ మొదలయిన అంతర్భేదములు ముస్లింలలో కలవు .బ్రహ్మ, విష్ణు ,మహేశ్వర ,గణపతి ,

హనుమత్ ,సరస్వతి ,లక్శ్మి  ,పార్వత్యాది భేదములు హిందూ దేవతామూర్తులలో కలవు .

దేనికదియే సంఘ ప్రశాంతికి భంగముగా పరిణమించెడిది .బాబా తాను మశీదులో నివసించుచున్నప్పటికీ ,నిత్యాగ్నిహోత్రి వలె 

ధునిని నిల్పుట ,మశీదు ముందర భాగమున 

తులసి మొక్కను పెంచుట ,ప్రమిదములు పెట్టి 

దీపములు వెలిగించుట ,విష్ణు సహస్ర నామాది 

గ్రంథములు పారాయణము చేయించుట ,

మొదలయిన కార్యములు హిందువులకు ప్రీతికరమైనవి .మాటిమాటికి ,అల్లహ్ మాలిక్ ,

అల్లా భళా కరేగా ,మొదలయిన మాటలు ,

మహమ్మదీయుడు,  అనిపించు వేషము ధరించుట మున్నగునవి మహమ్మదీయులకు 

ప్రీతికరములైనవి .

No comments:

Post a Comment