దత్త లీలా క్షేత్ర మహత్యం.....
షోడశ దత్త అవతారాలు..... 🙏🏻
12::: అదిగురువు
సంస్కృత:వాసుదేవనంద సరస్వతి స్వామి
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
శ్లో॥ చిదాత్మా జ్ఞాన రూపాయ గురవే బ్రహ్మ రూపిణే!
దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ॥
మహారాజు అయిన సుబాహువు, జ్ఞానియైన మదాలసలకు ముగ్గురు కొడుకులు జన్మించారు. వారిని ఆమె బాల్యంలోనించే ఉయ్యాలలో నుంచే, జోలపాట నుంచే జ్ఞానాన్ని బోధించి లౌకిక ముక్తులను చేసి ,ఆధ్యాత్మికo వైపు పంపింది. భర్త ఆజ్ఞ, కోరిక మేరకు చివరి పిల్లవాడిని రాజ్యాధికారుడని చేయాలని అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. కానీ అతని అన్నగారు అతడికి వివేకముదయింప చేయదలచిన ,అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి ఇతనిపై దండయాత్ర చేసేలా చేశాడు. రాజ్యం మొత్తం వదిలి అలర్కుడు అడవిలోకి పారిపోయి,సంక్షొభ సమయంలో మాత్రమే తెరిచి చూడమని, తన తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి తన దగ్గర ఉన్న పెట్ట తెరచి చూడగా తల్లి గారు రాసిన ఉత్తరం కనపడింది. ఉత్తరంలో చెడు సహవాసాలకు దూరంగా ఉండు, నీతిమంతులను మాత్రమే దరి చేర్చు.దుర్మార్గులకు, చేడు ప్రభావాలకు దూరంగా ఉండు, సద్గురువులను ఆశ్రయించడం మాత్రమే ఉత్తమం, అన్ని కోరికలు వదిలి వేయాలి. దుష్పరిణామాలు,దుర్జనుల సాంగత్యం వలన ఏర్పడిన ప్రభావానికి సాధు,సత్పురుషుల సాంగత్యం మాత్రమే దివ్య ఔషధం. గుంపులో ఉండద్దు. అంతః కరుణను శుద్ధి చేసుకో, ముముక్షువై ఉత్తమ సద్గురువు ఆశ్రయించడమే శరణ్యం అని ఆమె ఆదేశంగా రాసింది.
ఉత్తమ సాధువులు,సద్గురువు ఎక్కడ ఉంటారు?ఎలా కలుసుకోవాలి?అని తపనతో చివరకు సహ్యాద్రిపర్వత శ్రేణి కి వచ్చాడు. అక్కడ తపస్వియైన దత్తుని, ఆమలక వృక్షం క్రింద ఆషాడపూర్ణిమయుక్త శనివారంనాడు దత్తాశ్రమంలో దర్శించాడు. స్వామిని విశ్వాసంతో,ఆర్తితో ప్రార్ధించారు. దత్తుడతనికి శ్రీ మాయాముక్తావధూత నుంచి శ్రీ ఆది గురువుగా అవతరించి, అతనికి దర్శనమిచారు. స్వామి అతని విచారంవిని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. దానితో అతనికి స్వాంతన చేకూరింది. మమతా పూర్వకంగా దగ్గరకు తీసుకున్నారు.
నీ దుఃఖానికి కారణం ఏమిటి?సరిగా విచారిస్తే ఈ శరీరం ఎక్కడ నుంచి వచ్చింది?ఎక్కడ కు పోతోంది?నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?అని విచారించు. ఈ శరీరం నీరు, ఆకాశం, తేజస్సు,వాయువు,భూమి అనే పంచ భూతల కలయికతో తయారయి మళ్ళీ పంచభూతాలలో కలిసిపోతుంది.
ఈ దేహం మొత్తం చేయి, కాలు, ముక్కు,నోరు,చెవి ఇలా అనేక అవయవాల కలయిక. ఇలాంటి అవయవ సమాహారం పై మక్కువ వద్దు. నేను వీటి అన్నింటిని మించి స్వచ్చమైన చైతన్య స్వరూప ఆత్మను. కాబట్టి ఆత్మకు ఆనందం,దుఃఖం, అనేవి లేవు. శరీరానికి గాయం, మనస్సుకు బాధ ఇలాంటివి అహంకార భావ ఫలితాలే. అహం పోతే దుఃఖం,బాధ అన్ని పోతాయి అని దత్తత్రేయ స్వామి అదిగురువుగా ఆత్మ విచారాన్ని బోధించి అలర్కుడుని తరింప చేసాడు. అలర్కుడు శ్రీ దత్తాత్రేయ పాదపద్మాలకు నమస్కరించి సర్వ రాజ్యాన్ని సుబాహుకు అప్పగించి, ఆనందంలో ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ వున్నాడు. దత్త స్వామి ఆషాఢ శుద్ధ పూర్ణిమ, శనివారం నాడు ఆదిగురువుగా అవతారం స్వీకరించారు.
జై గురు దత్త.

No comments:
Post a Comment