Sunday, December 6, 2020

శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి . "ఓం ధన మాంగల్యదాయ నమః ".

 శ్రీ సాయినాథ అష్టోత్తర శత నామావళి .

"ఓం ధన మాంగల్యదాయ నమః ".


షిరిడీలో ద్వారకామాయి నందు ,సాయిబాబాను 

దర్శించుకుని ,ఎన్నెన్నో కోరికలు తీర్చమని ప్రార్ధించేవారు .బాబా మొదట వారి కోరికలు తీర్చి 

వారిని తమ అధ్యాత్మిక మార్గంలోనికి లాగుకొనేవారు .సాయి సచ్చరిత్రలో ,మదరాసు 

భజన సమాజం వారు ,ధన కాంక్షతో ఆయన 

చెంతకు రాగా -దాని యజమానికి అహంభావం తగ్గి ,తన శక్తిని గుర్తించేవరకు వాళ్లను షిర్డీలోనే 

ఆపారు .ఆపైన వారిని అశీర్వదించి పంపారు .

వారికి అక్కడ ఎంతో ధనం లభించింది .రఘునాద్ 

టెండుల్కర్ అనే భక్తుడు ఉద్యోగ విరమణ చేస్తున్నాడు .ఆయనకు వచ్చే ఫింఛను కుటుంబ 

పోషణకు సరిపోదు .బాబా వారి ప్రార్ధనను మన్నించి ఫించను సొమ్ము పెరిగేలా అనుగ్రహించారు .

 శ్రీ బి .వి .నరసింహస్వామి గారు 1940 సం .ప్రాంతంలో ,ఒకనాడు షిరిడీలో సమాధి మందిరం ముందు కూర్చొని ధ్యాన నిష్టలో మునిగిపోయారు .అప్పుడు ఆయన దగ్గరకు ఒక 

అపరిచిత వ్యక్తి (బెంగళూరు నుండి వచ్చానని చెప్పుకున్నాడు )వచ్చి ,అయనకు ఒక కాగితం 

సంచి ఇచ్చి ,"ఈ డబ్బు శ్రీ సాయబాబా సేవకు 

ఉపయోగించు "అని చెప్పి వెళ్లిపోయాడు .

అందులో 11 ,455 - రూపాయలు వున్నాయి .

సాయబాబా ధన ప్రధాన శక్తి అది .ఇక మాంగల్యం 

అంటే శుభం .కల్పతరువు అన్నీ ఇస్తుంది .కానీ 

కరుణామయుడైన సాయినాధుడు ,ఏది శుభప్రదమవుతుందో అది మాత్రమే ఇస్తారని 

సాయి సచ్చరిత్ర ఋజువు చేస్తుంది .అట్టి స్వామికి 

వందనం .

No comments:

Post a Comment