భగవంతుని లక్షణాలైన ,సత్ ,చిత్ ,ఆనందం అనేవి షిర్డి సాయినాధునిలో కనిపిస్తాయి .
"సచ్చిదాత్మనే నమః " అని కీర్తించుటలో సాయినాథుని సనాతనత్వం ,చైతన్య స్వరూపం
తెలుపబడ్డాయి .సాయిబాబా ఎనభై ఏళ్లు బ్రతికాడని ,పదహారు ఏళ్ల ప్రాయంలో షిర్డీ ప్రవేశం
చేశాడని ,ఆనడం భౌతిక దృష్టిలో కట్టిన లెక్కలు
మాత్రమే .సాయబాబా యే స్వయంగా నా వయసు లక్షల సంవత్సరాలు అని అనేకసార్లు
చెప్పారు .భగవంతుని వలె సాయినాధునికి
" ఉండుటయే " కానీ జన్మించడం వుండదు .
ఆయన సృష్టికి పూర్వమూ ఉంటాడు .సృష్టికి
అనంతరం కూడా ఉంటాడు ." సత్ " అని అందుకే
సాయిబాబాను కీర్తిస్తారు .ఇక " చిత్ " అని కీర్తించుటలో జడమునకు చైతన్యం కలిగించే
చైతన్య స్వరూపుఁడు సాయినాధుడు అని భావిస్తుంటారు .పాముల పుట్ట అయిన షిర్డీ గ్రామాన్ని మహా పుణ్య క్షేత్రముగా సాయబాబా
మార్చాడు .శ్యామా ,మహల్సాపతి ,దాసగణు ,
చందోర్కర్ ,బయజాబాయి ,లక్ష్మిబాయి షిందే
మున్నగు దేదీప్యమానాలైన మాణిక్యాలను ,
మట్టిలోంచి లేవనెత్తారు చైతన్య ఘనుడైన
సాయినాధుడు .అందుకే సాయినాథుని " చిత్ "
అని కీర్తిస్తారు .

No comments:
Post a Comment