Sunday, December 6, 2020

సాయిబాబా వేదాంతాన్ని ,భక్తిని ,అధ్యాత్మిక క్రమశిక్షణను ,నీతిని ,దైనందిన ప్రవర్తన ,సర్వప్రాణుల సమభావనను బోధించారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు .సాయిబాబా

 సాయిబాబా వేదాంతాన్ని ,భక్తిని ,అధ్యాత్మిక క్రమశిక్షణను ,నీతిని ,దైనందిన ప్రవర్తన ,సర్వప్రాణుల సమభావనను బోధించారు 


పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు .సాయిబాబా 

మాటలకు కాలదోషం పట్టదు .కాలదోషము పట్టని కమనీయ సూక్తులు .అంటారు పెద్దలు .

సాయిబాబా ఒకసారి " నీవు దాహము గలవారికి 

నీరిచ్చినచో ,ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో ,వస్త్రముల లేనివారికి వస్త్రములు ఇచ్చినచో ,నీ వసారా ఇతరులు కూర్చునుటకు 

ఇచ్చినచో భగవంతుడు మిక్కిలి ప్రీతిచెందును ."

అని పలికారు .

ఒకసారి మహారాష్ట్రకు చెందిన సత్పురుషుడైన 

ఏకనాథమహారాజ్ కాశీకి వెళ్లారు .ఒక కమండములో గంగా జలాన్ని తీసుకుని ,

రామేశ్వరంలోని శివుణ్ణి అభిషేకిద్దామని తద్వరా 

సంపూర్ణ కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుందని భావించాడు .కాశీనుండి తిరుగుప్రయాణం సాగించాడు .అది మంచి ఎండాకాలం .మార్గ 

మధ్యములో ఎండలు మండిపోతున్నాయి .

ఎక్కడా ఒక పచ్చని చెట్టుగాని ,చల్లని నీడగాని 

లేని ఒక ఎడారిలాంటి ప్రదేశములొ శిష్యులతో 

కలసి ఏకనాధుడు ప్రయాణం సాగిస్తున్నాడు .

అటువంటి వాతావరణములో ఒక చోట కృశించిపోయిన ఒక గాడిద మూలుగు విన్నాడు .

అది దాహముతో విలవిలా కొట్టుకొంటున్నది .

ఆ గాడిద దయనీయ పరిస్తితి చూశాడు ఏకనాధుడు .ఆ పరిస్థితికి చలించిపోయాడు .

వెంటనే తాము రామేశ్వరములో శివునికి అభిషేకం చేయాలని తీసుకు వెళుతున్న ఆ గంగా 

జలాన్ని ఆ గాడిద నోటిలో పోశాడు ." అదేమీ స్వామీ ! కాశీనుండి ఇంతవరకు గంగా జలము 

ఎంతో కష్టపడి తెచ్చాము .మనం ఆ నీటిని 

రామేశ్వరము వెళ్ళి ఆ నీటిని కలపాలి గదా ! 

ఇప్పుడు రామేశ్వరునికి ఏది అర్పించాలి ?"

అని శిష్యులు అడిగారు ." ఈ గాడిదయే నాకు 

రామేశ్వరము ." అని అన్నాడు ఏకనాధుడు .

ఏకనాధుడు రామేశ్వరము చేరకుండానే యాత్రా 

ఫలం సిద్దించినది .

No comments:

Post a Comment