దత్తలీలా క్షేత్ర మహత్యం...🙏🏻
దత్తాత్రేయ షోడశ అవతారాలు
4::: కాలాగ్ని శమనుడు.
వాసుదేవనంద సరస్వతి స్వామి దత్త పూర్ణ నుంచి
తెలుగు;రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి.
దత్తాత్రేయ అవతారాలలో చాలా ప్రముఖమైన అవతారంగా చెప్పబడినది.
అత్రి మహర్షి ధ్యానస్థులైనప్పుడు యోగాగ్ని జన్మించి మరలా అత్రిముని శరీరంలోకి ప్రవేశించి దహించసాగింది. శ్రీ హరి దత్తాత్రేయునిగా బ్రహ్మరంద్రం ద్వారా శరీరంలో ప్రవేశించగానే అత్రి మునికి కోటి చంద్రులు చల్లదనం కలిగి,నఖశిఖ పర్యంతం చల్లగా అయిపోయింది. ధాన్యం నుంచి లేవగానే అత్రిమహర్షి చూపు ద్వారా అనసూయ మాత ఉదరంలోకి దత్తాత్రేయ స్వామి మార్గశిర మాసం,శుక్ల పక్షం సప్తమి అనే శుభ ముహూర్తంలో ప్రవేశించారు. అనసూయ మాత అమిత తేజోమయ మైన అగ్నిలా ప్రకాశించింది. 9 రోజులు 9 మాసాలుగా జరిగిపోయి పౌర్ణమి రోజు నిర్గుణ, నిరాకార స్వరూపం తో 16 సంవత్సరాల బాలుడుగా బయటకు వచ్చారు. అర్ధం కాని అనసూయ మాత ఆనందంతో, ప్రశాంతం అయిన మనస్సుతో ఇలా కొడుకుగా జన్మించటం నాకు తృప్తిగా లేదు.నువ్వు చంటి పిల్లవాడుగా కావాలి. నీకు ఆహారం పెట్టడం,నలుగు పెట్టడం,నిన్ను సంరక్షించడం, మధురమైన జోల పాటలు పాడటం ఇలా పెంచుకోవాలి అని తెలిపింది. దత్తాత్రేయ స్వామి, చంటి పురిటి పిల్లవానిగా మారి అనసూయ మాత పక్కన కనిపించారు.సూర్యాస్తమయం తరువాత పౌర్ణమి చంద్రుడు చల్లని కిరణాలతో మరిపిస్తున్నాడు. అనసూయ మాత మాటను గౌరవిస్తూ స్వామి అవతరించారు.
అన్ని మాసాల్లో మార్గశిర మాసం శ్రేష్ఠమైన మాసం."(మాసానం మార్గశీర్షోహం"అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడా తెలియజేసారు.)
దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు అమృత గానంతో మురిపించారు. మంగళ వాద్యాలు మోగాయి. సకల సృష్టి పులకించింది. క్రీడలతో ,చంద్ర,దత్త, దుర్వాస మహాముని రూపంలో విశ్వ గురువు అయిన భగవాన్ దత్తాత్రేయ అత్రి,అనసూయలను చిన్న బాలుని రూపంలో సంతోష పెట్టారు.
జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్నిశమనా చ I
భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే !!
జననం:మార్గశిర పూర్ణిమ బుధవారం మృగశిరా నక్షత్రంలో జన్మించారు.
ఆ రోజు పంచామృత నైవేద్యం పెట్టి పై శ్లోకం చదవాలి.

No comments:
Post a Comment