Sunday, December 6, 2020

ఆర్థర్ అసబోర్న్ అరుణాచలం రమణ మహర్షి భక్తుడు .ఒకసారి షిర్డీవెళ్ళి బాబా సమాధిని దర్శించాడు .బాబా 1918 సం .లో మహాసమాది చెందినప్పటికీ ,అనేక అద్భుతాలు చేసి చూపారని అనుభవపూర్వకంగా ఒక సంఘటన రాశారు

 ఆర్థర్ అసబోర్న్ అరుణాచలం రమణ మహర్షి భక్తుడు .ఒకసారి షిర్డీవెళ్ళి బాబా సమాధిని 


దర్శించాడు .బాబా 1918 సం .లో మహాసమాది 

చెందినప్పటికీ ,అనేక అద్భుతాలు చేసి చూపారని 

అనుభవపూర్వకంగా ఒక సంఘటన రాశారు .

మిస్ దంట న అనే వృద్దురాలు ఏకాకి .తన ఉద్రేకమువలన తాను నివసిస్తున్న ప్రదేశము 

విడచి వెళ్లవలిసిన పరిస్ధితి ఏర్పడినది .

తనను ఆదుకొనేవారు లేరు .ఆమె విషాదంతో 

ఇంట్లొ ఉండగా ,అకస్మాత్తుగా ఇతరులు ప్రవేశించడానికి వీలులేని తన గదిలో తెల్లని బట్టలు ధరించిన ఒక ముస్లిం ఫకీర్ ప్రత్యక్షమై 

" కంగారు పడకు ! విచారపడకు ! నీవు కలకత్తా 

వెళ్ళినతరువాత పరిస్థితి అంతా చక్కబడుతుంది 

అని పలికి తనకు దక్షిణ సమర్పించుకోమన్నారు .

ఆమె తనవద్ద డబ్బు లేదంటే " ఆ బీరువా లొగల 

అరలో 35 రూపాయలు వున్నాయి చూడు ! " 

అని ఆన్నారు .ఆమె అల్మారాలో చూ డగా ఆందులో ఆయన చెప్పినట్లు డబ్బులు వున్నాయి 

దక్షిణ ఇద్దామని వెనుకకి తిరుగగా ఆ ఫకీర్ మాయమయ్యాడు .ఆ ఫకీర్ చెప్పినట్లుగా కలకత్తాలో ఉన్న ఆమె బంధువు ఆమెను చేరదీసాడు .ఈ విషయాన్ని మిస్ దంటన ,

ఆస్ బోర్న్ కు చెప్పినది .వెంటనే ఆయన తన 

గృహానికి వెళ్ళి సాయిబాబా పటాన్ని తెచ్చి 

చూపించగా " ఈయనే ఆ ఫకీర్ .తలకు అచ్చంగా 

ఆ తెల్లగుడ్డ ఉన్నది ." అన్నది .ఆశ్చర్యంగా .

ఆ ఫకీర్ సాయిబాబా అయి వుంటాడని తన ఇంటికి వెళ్ళి ఫొటొ తెచ్చి చూపించాడు ఆస్ బోర్న్ 

ఎందుకంటె సాయబాబా మహ మహిమాన్వితుడు .అది ఆయనకు తెలుసు .

No comments:

Post a Comment