దత్త లీలా క్షేత్ర మహత్యం....🙏🏻
దత్తాత్రేయ షోడశ అవతారాలు...
8 :: జ్ఞాన సాగరుడు
ఒకసారి విశ్వగురువు అయిన భగవాన్ దత్తాత్రేయ స్వామి ఏకాంతంగా బదరికావనంలో కూర్చొని వున్నప్పుడు ఈ సిద్దలోకం నా ఉపదేశం తీసుకొని సిద్ధ స్థితికి వచ్చింది. కానీ వారిలో కామ,క్రోధం,వికారం,నశించలేదు. శాంతి,సుఖం,లాభం,వీరు పొందలేదు. అన్ని దుఃఖాలకు మూలం అయిన కామం,క్రోధం,అజ్ఞానం ఈ జీవులకు క్షోభకు గురి చేస్తోంది. వీటిని అధీనం లో ఉంచుకోవాలి.అందుకే ఈ జీవులకు విపత్తులు కలుగుతున్నాయి.ఈ అజ్ఞానం వారిని, ఈసప్రపంచంని నాశనం చేస్తోంది. అని తనలో తాను తలచారు. వీటి నుంచి జీవులను బయట పడేయాలి అని తలచి వారికి జ్ఞాన బోధ చేయాలి అని తలచారు. జ్ఞానం ద్వారానే వీరు సంతోషంగా ఉండగలరు అని తలచి స్వచ్ఛమైన జ్ఞాన స్వరూపులుగా కనిపించారు.
అందుకే ఈ అవతరానికి జ్ఞాన సాగరుడు అని పేరు.ఫాల్గుణ మాసం,ఆదివారం, పునర్వసు నక్షత్రం,శుద్ధ దశమి రోజు జ్ఞాన సాగరుడుగా అవతరించారు.
ఫాల్గునే మాసి శుక్ల మాం
దశాత్మమ్ రవివాసరే!
భాస్కర ఉదయే చైవ
పునర్వసు నక్షత్ర యోక్తే!!
ఈ విధంగా శుభ ముహూర్తంలో బాదరికాశ్రమం లో సిద్ధుల మండలిలో వారి పైన ప్రకాశవంతమైన తేజస్సుతో పెద్ద కాంతి పుంజంలో దత్తాత్రేయ స్వామి కూర్చొని వున్నారు. ఈ సిద్ధులు అజ్ఞానంతో స్వామిని స్వామి నేర్పిన సిద్ధితోనే కిందకు లాగాలని
చూశారు. కానీ వారి వల్ల కాలేదు. ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. ఎంత గాలి వీచిన రాతి పర్వత శిఖిరాలు స్వల్పంగా కూడా మారవు. అలాగే ఆకాశం నుంచి పుట్టిన గాలి ఆకాశమును కదల్చలేదు,ఈ సర్వ కారణములకు కారణమైన వాడిని నేనే ,నన్ను ఏమి చేయలేరు అని పలికిన దత్తుల మాటలు విని స్వామి ని శరణు పొందారు. స్వామి వారితో తాను చెప్పిన మంత్రాలు జపించమని,జ్ఞాన బోధ చేశారు.
శ్లో ॥ సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞాన దీపాయచాత్మనే!
సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమోనమః॥

No comments:
Post a Comment