దత్త పురాణాంతర్గత దత్త స్తోత్రం
ఆయురాజు, భార్య ఇందుమతి చేసిన దత్త స్తుతి 🙏🏻
1.నమః పరస్మై పురుషాయ వేధసే! షడింద్రియజ్ఞాన విదూరవర్త్మనే !
పరాత్మనే హంకృతిదూషితాత్మానం !గుణాత్మనాం సంసృతి హేతుకేతవే ॥
భావము:: 🌹పురుషోత్తముడు అన్నింటిని చేయువాడు పరమాత్మ, షడింద్రియములజ్ఞానములచే తెలియబడనివాడు, అంతర్యామి అయిన ఆ దత్తాత్రేయునకు నమస్కారం. అహంకారము వలన తనను తాను మరచిన వారికి, గుణములకు వశమైన వారికి, పరమాత్ముడై , అజ్ఞానమును ధ్వంసం చేయు స్వామికి అనేక వందనములు.
2. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే!విశుద్ధ విజ్ఞానఘనాయ సాక్షిణే!
ద్విజాయ దేవాయ చ హేతవే!మునీశ్వరాయాత్రిసుతాయ యోగినే ॥
భావము::🌹 పరిశుద్ధ బుద్ధికి, సర్వసాక్షికి, ద్విజునకు, అత్రి తనయునకు, ఈశ్వరుడైన వానికి, యోగీశ్వరునకు, మునీశ్వరునకు, దేవతలందరికీ మూలమైన దేవదేవునకు నమస్కారములు.
3. వృజినజలధిపారం ప్రాపయేద్యః ప్రపన్నాన్!
స్తుత మభరసుతాభంయోదదద్దత్తదేవః ॥
4. తదహమమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం!
పురుషమృషభమాద్యం త్వాం ప్రపన్నో స్మి భూయః ॥
భావము::🌹 శరణు అని ఆశ్రయించిన వారిని పాపసముద్రము నుంచి బయటపడవేసే మహనీయుడు ఎవరో, ఎవరు మాకు సత్పుత్రుని ప్రసాదించెనో ఆ దత్త దేవుని కి నమస్కారములు. దేవతలచే
పూజింపబడేవాడు,యోగులచే నమస్కారించ బడేవాడు, పురుషులలో శ్రేష్ఠమైనవాడు, ఆదిపురుషుడైనట్టి ఓ దత్తాత్రేయ స్వామి! నిన్ను శరణు వేడుతున్నాను.
5. యో మే దదుత్సుతం దివ్యం!విభుతేజోపబృంహితమ్ !
స పాతు సర్వదా పుత్రం!సర్వదేశే చ యద్గతిః ॥
భావము::🌹 ఏ దత్తాత్రేయుడు తేజస్సు తో ఉట్టిపడే దివ్యమైన కుమారుని నాకు వరముగా ఇచ్చెనో ఆ దత్తాత్రేయుడు నా పుత్రుని ఎల్లప్పుడూ సంరక్షించును గాక. ఈ జగత్తుకు, అన్ని ష్థానములకు,అందరికీ ఏ మహనీయుడు దిక్కో ఆ స్వామికి నమస్కరించుచున్నాను.
6. యస్య ప్రసాదజో బ్రహ్మ! రుద్రతేజః సముద్భవః!
కింకరా యే సురా యస్య!స మాం పాతు సదా హరిః ॥
భావము::🌹 ఎవరి అనుగ్రహం వలన బ్రహ్మదేవుడు ఉద్భవించెనో, రుద్రని తేజస్సు పుట్టెనో, దేవతలందరూ ఏ మహానుభావునికి సేవకులో అట్టి హరి నన్ను, నా బిడ్డను సంరక్షించుగాక.
7. నమోస్తే పురుషాధ్యక్ష!ఏకాధ్యక్ష జగద్గురో ॥
దత్తాత్రేయ సురేశాన! పాహి మాం భవసంకటాత్ ॥
భావము::🌹 ఓ జగద్గురు!పురుషాధ్యక్షా!జగత్తును నడిపేవాడా!దేవతలకు నాయకుడా, దత్తాత్రేయా నన్ను ఈ సంసార సంకటములనుంచి సంరక్షింపుము.
8. త్వత్ర్పసాదేన దేవేశ!సర్వం సౌఖ్యమవాప్తవాన్!
గతిం మే దేహి పాదాబ్జే! నాన్య మిచ్ఛామ్యహం ప్రభో ॥
భావము::🌹 ఓ స్వామి!ప్రభూ!నీ అనుగ్రహం వలన సౌఖ్యములను పొందితిని. ఓ ప్రభో! నీ పాదములే మాకు దిక్కు. మరొకటి ఏమీ కోరము. మాకు నీవే గతి.
సరళీకరణ ,సేకరణ by
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డు పల్లి 🙏🏻

No comments:
Post a Comment