Tuesday, May 14, 2024

ఒకసారి షిరిడీ లో ద్వారకామాయిలో ఒకసారి సుప్రసిద్ధ హిందుస్థానీ గాయకుడైన ఖాన్ సాబ్ అబ్దుల్ కరీమ్ ఖాన్ ఈ భక్తిగీతాన్ని పీలూ రాగంలో బాబా ఎదుట పాడి బాబా ఆశీసులు పొందాడు

 *" హేచి దాన్ దేగా దేవా* 

*తుఝా విసర్ న వహ్వా* 

*విసర్ న వహ్వా* 

*తుజా విసర వహ్వ*

*గుణ గాయిన్ ఆవడి* 

*హెచీ మాజ్హీ సర్వ జోడీ*

*మాజీ సర్వ జోడీ*

*న లగే ముక్తీ అనీ సంపదా*

*సంత్ సంగ దే యీ సదా*

*సంత్ సంగ దే యీ సదా*

*తుకా మ్హానే గర్భ వాసి* 

*సుఖే ఘాలావే అం హాసి.*


*తెలుగు అర్థం మరియు భావము.*


*ఓ భగవంతుడా ! నిన్ను ఎల్లప్పుడూ మరువకుందును గాక ! ఈ వరం నాకు ప్రసాదించు.*

*నీ అద్భుతమైన గుణసంపదను ప్రేమతో గానము చేసెదను. ఇదే నా సంపద మరియు పెన్నిధి.*

*నేను నీవద్దనుండి ఎటువంటి సంపదలు గానీ ఐశ్వర్యము గానీ మోక్షముగానీ కోరను.*

*నీ పాదములు సేవించే సత్పురుషుల సాంగత్యం ప్రసాదించు.*

*నా కొరిక నెరవేర్చుటకు ఎన్ని జన్మలైనా జన్మించుటకు సిద్దముగా ఉన్నాను.*


*సంత్ తుకారాం మహరాజ్ రచించిన ఈ భక్తి గీతం (అభంగము ) మహరాష్ట్ర భాషలో ఎంతో ప్రాచుర్యం పొందినది. నిత్యమూ ఈ అభంగాన్ని పఠిస్తుంటారు.*


*ఒకసారి షిరిడీ లో ద్వారకామాయిలో ఒకసారి సుప్రసిద్ధ హిందుస్థానీ  గాయకుడైన ఖాన్ సాబ్ అబ్దుల్ కరీమ్ ఖాన్ ఈ భక్తిగీతాన్ని పీలూ రాగంలో బాబా ఎదుట పాడి బాబా ఆశీసులు పొందాడు.* 

*పిదప బాబా అతని కుటుంబానికి రక్షణగా ఉన్నాడు.*

No comments:

Post a Comment