Tuesday, May 14, 2024

సాయిబాబా ఎవరు ?* *భక్తుడా ? జ్ఞానియా ? కర్మిష్టా ? యోగియా ?*

 *సాయిబాబా ఎవరు ?* *భక్తుడా ? జ్ఞానియా ? కర్మిష్టా ? యోగియా ?*

*ఇవి అన్నీ.* 


*సాయిబాబా వద్దకు శివ భక్తుడైన మేఘశ్యాముడు వచ్చాడు.*

*వామన్ ప్రాణ్ గోవింద్ పాటిలు జ్ఞానిగా రూపొందించాడు.*

*రాధాకృష్ణమాయి గొప్ప కర్మిష్ఠి.*

*యోగాభ్యాసి రాంబాబా సాయిని దర్శించటానికి వచ్చాడు.* 

*యోగ సూత్రాలలో తనకు గల సందేహాలను నానాసాబ్ చంద్రోర్కర్ వద్ద తీర్చుకోవటానికి.* *ఉల్లిపాయతో రొట్టెలను తింటున్న సాయిబాబా ను చూసి, అట్టి వ్యక్తి తన సందేహాలను ఏ విధముగా నివృత్తి చేయగలడని సందేహించాడు.*

*బాబా రాంబాబా ను చూసి "ఓ కుక్కా ! ఇటు రా ! ఉల్లిని జీర్ణించుకొన గలవాడే తినాలి " అని అన్నారు.*

*యోగాభ్యాసి అయిన రాంబాబా సాయి అంతర్యామిత్వాన్ని, తన అజ్ఞానాన్ని గ్రహించాడు.*

*అప్పటి నుండి సాయి భక్తుడైనాడు.*

*సన్యాసం స్వీకరించి పూణేలో స్థిరపడ్డాడు. తన గురువైన సాయిని గురుపూర్ణిమ నాడు దర్శించేందుకు వచ్చేవాడు.*

*బాబా బోధనలకు అనుగుణంగా జీవించాడు.* *బాబా "అహంభావం ఆధ్యాత్మికతకు పరమ విరోధి " అని అంటునేవారు.*

*రాంబాబా " తాను" అను పదాన్ని విస్మరించారు. "నేను "బదులు శరీరాన్ని చూపుతూ "రామ " అనేవారు.*

*సాయిబాబా తనను ప్రతి జీవిలో దర్శించమనేవారు.**

*రాంబాబా అన్ని జీవులను దివ్యాత్మలాగా భావించేవాడు. సాయిబాబాను ప్రేమించటమంటే, సాక్షాత్ గురువు రూపంలో ఉన్న పరబ్రహ్మను ప్రేమించుటే అని అనేవారు రాంబాబా " పరమ భక్తురాలైన మీరాబాయి లాంటి వ్యక్తులు మాత్రమే సాయిబాబా లోని దివ్యప్రేమను గుర్తించగలరు.*

*కబీరు లాంటి దివ్య పురుషులు మాత్రమే బాబాలోని మార్మిక సత్యాలను గ్రహించగలరు.*

*సిక్కుమత వీరుడైన  గురుగోవింద్ సింగ్ లాంటి ధైర్యశాలి మాత్రమే తన శిరస్సును సాయికి సమర్పించగలడు.*

*సెయింట్ ఫ్రాన్సిస్ లాంటి మహాత్ముడు మాత్రమే తన జీవిత సర్వస్వాన్ని బాబా సేవకే వినియోగించగలడు* 

*దైవ ప్రేమతో మత్తెక్కిపోయిన రబియా లాంటి భక్తురాలు మాత్రమే ప్రేమ తప్ప మరేమీ అనుభవం పొందగలరు " అని పలుకుతారు రాంబాబా.*

*షుమారు 125 సంవత్సరాలు జీవించి, సాయినాధునిలో ఐక్యమైపోయారు.*

*"ఇతరుల జీవితాలకు నీవు ఏమి చేసావో, దానినే నీవు జీవితంలో పొందుతావు "- అని రాంబాబా వాక్కు.*

No comments:

Post a Comment