Thursday, May 16, 2024

స్మరణమాత్ర సంతుష్టాయ

*స్మరణమాత్ర సంతుష్టాయ.*

*షిరిడీలో సాయిబాబా  గానీ, గాణ్గాపురంలో శ్రీ నరసింహాసరస్వతి స్వామిగారు అవతారాలన్నీ మానవఉద్ధరణ కొరకే మానవరూపములో అవతరించటానికి ఏవో కారణాలు వుంటాయి.*

*రామచరిత మానస్ రచించిన సంత్ తులసీదాసు రామ తత్వాన్ని బోధించినట్లు, దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు దత్తాత్రేయ తత్వాన్ని చాటిచెప్పారు.* 
*ఫలితంగా దత్త ఆరాధన విశేషముగా వ్యాపించినది.*

*మహరాష్ట్రలో దత్తా అవతారాలన్నీ సద్గురు తత్వాన్ని భక్తులకు అందించారు.* 
*అందులో విశేషంగా శ్రీ నరసింహ సరస్వతివారి కాలములో అనేక లీలలు, మహిమల ద్వారా అర్తత్రాణ పరాయణత్వం భక్తులకు ఎంతో మేలుజరిగింది.*

*గత జన్మలో నరసింహ సరస్వతి పేరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి.*
*శ్రీపాదవల్లభులు కూడా షిర్డి సాయినాధునివలె తనవైపు ఒక అడుగు ముందుకి వేస్తే, పది అడుగులు ముందుకి వేసి భక్తులను సంరక్షించేవారు.* *శ్రీపాదులవారు కురుపురంలో ఉన్నప్పుడు ఒక రజకుడు, ఏమీ ఆశించకుండా స్వామివారి సేవ చేస్తుండేవాడు. అతని సేవకు శ్రీపాదులవారు పరమానందభరితులయ్యేవారు.*
*సేవించిన రజకునికి తురుష్కు రాజుగా జన్మ ప్రసాదించి, ఆనందించమని వరమిచ్చారు.*
*అందుకు ఆ రజకుడు మరొ జన్మలోకూడా శ్రీ పాదవల్లభుని దర్శనం ప్రసాదించమని కోరాడు.*
*శ్రీపాదులవారు అందుకు " సరే "  అన్నారు.*
*తరువాత నరసింహ సరస్వతిగా మరో అవతారం వచ్చింది.* 
*శ్రీపాదులవారి కాలంలొ ఒక ఇల్లాలు తన కుమారునితో పాటు ఆత్మహత్య చేసుకోబుతుండగా వారిని రక్షించి మందమతి అయిన కుమారునికి సర్వవిద్యలు ప్రసాదించారు, అంతేగాక ఆ ఇల్లాలుకి మరొ జన్మలొ తనవంటి పుత్రరత్నం కలుగుతాడని దీవించారు.*
*తనవంటి వారు తాను గాక మరి ఎవ్వరూ ఉండరు గనుక శ్రీపాదువల్లభులు ఆ ఇల్లాలికి స్వయంగా కుమారుడై జన్మించారు.*

*భక్తుల కష్టాలు సద్గురువులు చూడలేరు. అందుకే స్మరణ చేస్తే చాలు. ఆపదలలోను, కష్టములలోను ఆదుకొనే కరుణామూర్తులు.*

No comments:

Post a Comment