Thursday, May 16, 2024

నిరంతరమూ సాయిబాబా సన్నిధిలో ఉండే మహల్సాపతి ఒకసారి సాయిబాబా పిర్రమీద గడ్డతో బాధపడుతుండటం చూశాడు

*నిరంతరమూ సాయిబాబా సన్నిధిలో ఉండే మహల్సాపతి ఒకసారి సాయిబాబా పిర్రమీద గడ్డతో బాధపడుతుండటం చూశాడు.*
*ముందు బాబా పడుతున్న బాధ మహాల్సాపతి కి అర్థం కాలేదు.*
 *ఒక్కోసారి బాబా కుర్చోడానికి కూడా ఎంతో బాధను అనుభవించేవారు.*
*బాబా మహల్సాపతితో " అరే భగత్ ! నా భక్తులను నేను గడ్డతో బాధపడనిస్తానా ? ఇటు చూడు. నేను గడ్డతో ఎంత బాధపడుతున్నానో,తొందరలో నయమవుతుందిలే" అని పలికాడు.*
*అలా రెండు మూడు రోజులు బాధపడ్డాక గడ్డ చితికింది.*
*భక్తులందరూ " అమ్మయ్య ! గడ్డ చితికింది. బాబా బాధపడనవసరం లేదని అనుకున్నారు."*
*బాబా గడ్డతో బాధపడుతున్న సమయములోనే మహల్సాపతి భార్య తన సొదరుని ఇంటికి వెళ్ళినది. ఆమె తన సోదరుఁడు ఉంటున్న నండూరు షింగోటా అని గ్రామము నుండి మహల్సాపతి కి ఉత్తరం రాసింది.*
*ఆమెకు కొద్దిరోజుల క్రితం పిర్రమీద గడ్డ లేచినదని, బాధతో విలవిలలాడి పోయానని, సాయినాథుని ప్రార్ధించానని, తక్షణమే బాధ పోయినదని, గడ్డ మాత్రం రెండుమూడు రోజుల తరువాత చితికినదని రాసింది.*
*అప్పుడు మహల్సాపతికి అర్థమైనది.* *బాబా తన భార్య గడ్డను గ్రహించి రెండుమూడు రోజులు బాధ పడుట చూశాడు.*

 *బాబాకు తన కుటుంబం నందు గల ప్రేమకు తెలుసుకుని ఆనందముతో కన్నీరు కార్చాడు.*

No comments:

Post a Comment